బిగ్‌ బాస్‌ లో అస‌లు మ‌జా: బిగ్‌ బాస్‌ నే ఓ ఆటాడుకున్న బామ్మ‌

Update: 2019-10-18 04:31 GMT
బిగ్ బాస్ ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే...గురువారం ఎపిసోడ్ ఒక ఎత్తు అయింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడిస్తూ వారి బంధువులని ఇంటిలోకి వరుసగా ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వితికా చెల్లి - అలీ భార్య - శివజ్యోతి భర్త - బాబా భాస్కర్ భార్య - పిల్లలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక గురువారం ఎపిసోడ్ లో వరుణ్ బామ్మ - రాహుల్ తల్లి - శ్రీముఖి తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వరుణ్ బామ్మ ఇంటిలోకి అడుగుపెట్టడమే ఫుల్ ఎంటర్ టైన్ చేసింది.

ఇంటిలోకి వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా మాట్లాడుతూ - సరదాగా సెటైర్లు వేస్తూ బిగ్ బాస్ నే ఒక ఆట ఆడుకుంది. తనకు వరుణ్ - వితికా - శ్రీముఖిలు తప్ప ఎవరు తెలియదని - కానీ ఎక్కడో పుట్టి అందరు ఒకే చోట కలిసి మెలిసి ఉండటం చాలా బాగుందని చెప్పారు. అలాగే తాను రోజు బిగ్ బాస్ చూస్తానని - తాతయ్య కూడా బిగ్ బాస్ చూస్తాడని చెప్పుకొచ్చారు. ఇక బాబా భాస్కర్ అందరికీ వంట బాగా చేసి పెడుతున్నాడని - తాము ఒకవారం చేయడానికే కష్టపడతామని - కానీ బాబా ఇన్ని రోజులు చేయడం చాలా గ్రేట్ అని - ఆయన్ని గిన్నీస్ బుక్ లో ఎక్కించాలని చెప్పారు.

ఆ తర్వాత బిగ్ బాస్ మీరు ఎలా ఉంటారో అని అడిగి..ఒక ఫోటో ఉంటే పంపండి చూస్తానని - మీరు ఎవరిని ఏ టాస్క్ ఎలా ఆడించాలో అలా ఆడిస్తున్నారని చెప్పిన బామ్మ...తనకు కూడా టాస్క్ లు ఇస్తే బాగుంటుందని - నెక్స్ట్ సీజన్ మా వాళ్ళని తీసుకుని బిగ్‌ బాస్ కు వస్తా అంటూ బిగ్‌ బాస్ ని రిక్వెస్ట్ చేశారు. అలాగే బిగ్ బాస్ తప్పకుండా మా ఇంటికి రావాలని - మా ఇల్లు మాసబ్ ట్యాంక్ లోనే ఉందని - మీరు రాకపోయినా - మీ ఫోటో అయినా పంపాలని ఒకసారి చూస్తానని నాన్ స్టాప్ గా మాట్లాడేశారు. బామ్మ వల్ల బిగ్ బాస్ ఇంటిలోనే కంటెస్టంట్స్ తో పాటు - ప్రేక్షకులు కూడా ఫుల్ ఎంటర్ టైన్ అయ్యారు.


Tags:    

Similar News