పవన్ పై ప్రతీసారి వివరించాలా??

Update: 2017-04-12 16:31 GMT
మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్నాదమ్ములైన ఈ స్టార్ హీరోల మధ్య మనస్ఫర్ధలు.. మీడియాకి ఈ టాపిక్ అంటే మహా ఇష్టం. ఏదైనా ఫిలిం ఈవెంట్.. పర్సనల్ ఫంక్షన్ లో చిరంజీవి పక్కన పవన్ కనిపించకపోతే.. వెంటనే మొదలైపోయే హంగామా ఇదే. అయితే.. అన్నయ్య అంటే తనకు ఎంతిష్టమో పవన్ కళ్యాణ్ చాలా సార్లే చెప్పాడు.

 నా దృష్టిలో అన్నయ్యే హీరో.. నేను కాదు.. అని కూడా చెప్పాడు. తమ్ముడు అందుకున్న ఖ్యాతికి చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. తన కొడుకు లాంటి వాడు అని కూడా అంటారు. అయినా సరే మీడియా హంగామా తప్పదు. తాజాగా ఈ టాపిక్ పై వరుణ్ తేజ్ రియాక్ట్ అయ్యాడు. ఆ అన్నాదమ్ములిద్దరూ చాలాసార్లు కలిసి కనిపించినా ఇలాగే రాస్తుంటారని.. ప్రతీసారి వాళ్లిద్దరూ కలిసి కనిపించాలని అంతా భావిస్తుంటారని అన్నాడు వరుణ్ తేజ్. అయితే.. వాళ్లిద్దరి మధ్య ఎంత సఖ్యత ఉందో.. వారి అనుబంధం ఎలాంటిదో అందరికి తెలియదని.. తమ కుటుంబానికి మాత్రమే ఆ విషయం తెలుసన్నాడు వరుణ్ తేజ్.

ఇలా ప్రతీ సారి వివరణ ఇవ్వాలంటే  కుదరదని.. తెలిసీ తెలియని వాళ్లు ఏదో రాసేస్తే వాటికి సమాధానం చెప్పాల్సిన పని లేదన్న వరుణ్.. తమ కుటుంబం ఎంత బాధపడుతుందో మీడియా ఆలోచించాలని అన్నాడు. నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత చిరు-పవన్ లు ఒక స్టేజ్ పై కనిపించిన సందర్భం లేదు. మెగా స్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం పెద్ద దుమారమే అయింది. ఆ సమయంలో కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News