జాంబీ గెటప్‌ లో మెగా వారసులు!

Update: 2016-11-02 07:30 GMT
హాలోవీన్ పార్టీ.. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో బాగా తక్కువే. పైగా టాలీవుడ్ తారలు హాలోవీన్ పార్టీ చేసుకోవడం అంతగా బైటకు రాని విషయం. కానీ ఇప్పుడు అన్ని ఏరియాల్లోనూ జాంబీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కేరక్టర్లతో కూడా పరిచయం పెరుగుతోంది. జాంబీ మూవీలకు డిమాండ్ పెరిగాక.. హాలోవీన్ పార్టీల ట్రెండ్ టాలీవుడ్ కి కూడా పాకిందనే చెప్పాలి.

రీసెంట్ గా తన స్కూల్ విద్యార్ధులతో మంచు విష్ణు హాలోవీన్ పార్టీ ఏర్పాటు చేయగా.. అందులో మనోజ్ సహా పలువురు జాంబీల గెటప్ లో అలరించారు. ఇలాంటి భయంకరమైన గెటప్స్ తో మెగా ఫ్యామిలీ వారసులు కూడా పార్టీ చేసుకున్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్.. కుమార్తె నీహారికలు జాంబీ గెటప్ లలో కనిపించి భయపెట్టేశారు. చూసేందుకు డిఫరెంట్ గా ఉన్నా.. మెగా ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన తారలను ఇంత భయంకరమైన రూపంలో చూపి తెగ ఫీలైపోయారు.

అయితే.. ఇది జస్ట్ ఒక పార్టీకి సంబంధించిన విషయమే కాబట్టి.. ఎవరూ అంత బెంగ పెట్టేసుకోవాల్సిన పని లేదు. పైగా అందంగా తయారవడమే కాదు.. డిఫరెంట్ గా మేకప్ లు వేసుకుని జనాల్లోకి వచ్చేందుకు సిద్దపడ్డానికి టాలీవుడ్ తారలు సిద్ధపడడాన్ని మాత్రం ప్రశంసించాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News