కొత్త పోస్ట‌ర్.. వ‌రుణ్ తేజ్ కేక పుట్టించాడు

Update: 2017-01-18 14:15 GMT
ఈ మ‌ధ్యే ‘మిస్ట‌ర్’ టీజ‌ర్ తో మెగా అభిమానుల‌కు మంచి కిక్ ఇచ్చాడు వ‌రుణ్ తేజ్. ఇప్పుడు త‌న కొత్త సినిమా పోస్ట‌ర్ తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. ‘మిస్ట‌ర్’.. ‘ఫిదా’ త‌ర్వాత వ‌రుణ్ న‌టించ‌బోయే కొత్త సినిమా పోస్ట‌ర్ ఈ రోజు లాంచ్ చేశారు. చాన్నాళ్లుగా చ‌ర్చ‌ల్లో ఉన్న డెబ్యూ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి తీయ‌బోయే సినిమానే ఇది. గ‌తంలో ఫీల్ మై ల‌వ్ అంటూ ఈ సినిమా టైటిల్ గురించి ప్ర‌చారం జ‌రిగింది. ఐతే ఈ రోజు టైటిల్ ఏమీ లేకుండానే పోస్ట‌ర్ లాంచ్ చేశారు. ఇంత‌కుముందు అనుకున్న‌ట్లు దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌ట్లేదు. ఛ‌త్ర‌పతి ప్ర‌సాద్ ‘శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర’ బేన‌ర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వ‌రుణ్ తేజ్ చాలా అందంగా క‌నిపిస్తున్నాడు ఈ సినిమా పోస్ట‌ర్ల‌లో గురువారం అత‌డి పుట్టిన రోజు నేప‌థ్యంలో విషెస్ చెబుతూ ఈ సినిమాను అనౌన్స్ చేశాడు నిర్మాత ప్ర‌సాద్. ‘స్నేహ‌గీతం’తో పాటు కొన్ని సినిమాల్లో న‌టించిన వెంకీ అట్లూరి మెగా ఫోన్ ప‌డుతుండ‌టంతో అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందించ‌బోతుండ‌టం విశేషం. త‌మిళంలో ‘రాజా రాణి’.. ‘క‌త్తి’.. ‘తెరి’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు ఛాయాగ్ర‌హ‌ణం అందించిన జార్జ్ సి.విలియమ్స్ ఈ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతుండ‌టం విశేషం. ఈ ఏడాది ఆఖ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌న్న‌ది ప్లాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News