వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అంతరిక్షం టీజర్ ఇందాకా విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్ మూవీగా చెప్పబడుతున్న అంతరిక్షం మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా కట్ చేసినా చూచాయగా స్టోరీ లైన్ తో పాటు మేకింగ్ క్వాలిటీని కూడా శాంపిల్ గా చూపించారు.
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిహిర స్పేస్ ప్రాజెక్ట్ టీమ్ లో వరుణ్ తేజ్ ఉంటాడు. అందులో భాగంగానే తన టీమ్ మేట్స్ ఆదితిరావు హైదరి సత్యదేవ్ లతో పాటు అక్కడికి చేరుకుంటాడు. కాని అనుకోని అవాంతరాలు అడ్డంకుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఒకదశలో దీన్నుంచి వైదొలిగితే దేశ ప్రతిష్టకే భంగమనే పరిస్థితుల్లో వరుణ్ తేజ్ దీన్నో సవాల్ గా తీసుకుంటాడు. మరి ఊపిరి కూడా కృత్రిమంగా తీసుకునే అంతరిక్షంలో తన టీమ్ ఏం చేసిందన్నదే దీని థీమ్ గా కనిపిస్తోంది.
అద్భుతమైన క్వాలిటీతో స్టన్నింగ్ విజువల్స్ తో సంకల్ప్ రెడ్డి మరోసారి తనలోని టాప్ టెక్నీషియన్ ని బయటకు తీసుకొచ్చాడు. గ్రావిటీ- ఇంటర్ స్టెల్లార్ లాంటి హాలీవుడ్ సినిమాలను రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు ఇందులో సీజే మరీ కొత్తగా అనిపించకపోయినా మెజారిటీ వర్గానికి మాత్రం ఇది మంచి అనుభూతి ఇస్తుందనడంలో డౌట్ అక్కర్లేదు.పైగా మంచి డ్రామా ను జోడించిన సంకల్ప్ వాటికి దీనికి మెప్పించే విషయంలో చాలా వ్యత్యాసం చూపించబోతున్నాడు. క్రిష్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న అంతరిక్షంలో లావణ్య త్రిపాఠితో పాటు అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లో అదితిని చూపించారు కానీ లావణ్యను మాత్రం దాచేసారు. కథ ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్త పడినా మంచి ఇంప్రెషన్ రాబట్టుకోవడంలో అంతరిక్షం టీమ్ సక్సెస్ అయ్యింది,