రేసులో నెగ్గాలంటే స్వేదం చిందించాలి

Update: 2020-01-10 16:18 GMT
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌యోగాలు సాటి హీరోల్ని విస్మ‌య‌ప‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగా హీరోల్లోనే డేరింగ్ డెసిష‌న్స్ తీసుకునే యంగ్ ట్యాలెంటుగా గుర్తింపు ఉంది. ముకుంద‌- కంచె- ఫిదా- తొలి ప్రేమ‌- అంత‌రిక్షం- ఎఫ్ 2 .. ఇలా ప్ర‌తిదీ ప్ర‌యోగ‌మే. అయితే ఈసారి కూడా ఏమాత్రం త‌గ్గ‌లేకుండా మ‌రో ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టాడు. వ‌రుణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ తాజా చిత్రం ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం వ‌రుణ్ కొత్త లుక్ కి ఛేంజ్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.

టాలీవుడ్ హీరోల్లోనే నెవ్వ‌ర్ బిఫ‌ర్ లుక్ ని తెచ్చేందుకు క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాడు. ఈసారి ఎంచుకున్న క‌థాంశం ప్ర‌యోగాత్మ‌క‌మైన‌ది. పైగా బాక్సింగ్ నేప‌థ్యంలోని క‌థాంశం కావ‌డంతో దానికి త‌గ్గ‌ట్టుగా రూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నాడు. వ‌రుణ్ ని వెండితెర‌పై మ‌రో కొత్త లుక్ లో ఫ్యాన్స్ చూడ‌బోతున్నారు. అత‌డు కిక్ బాక్సర్ గా క‌నిపిస్తాడు.. పైగా 6 ప్యాక్  చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. అయితే ఇవి రెండూ ఎంతో ఛాలెంజింగ్ టాస్క్స్ కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే వ‌రుణ్ క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాడు. ఇప్ప‌టికే బాక్సింగ్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. రెగ్యుల‌ర్ జిమ్ తో లుక్ ని ఛేంజ్ చేస్తున్నాడు.

తాజాగా మారిన లుక్ ఫోటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు వ‌రుణ్‌. బాక్సింగ్ ప్రాక్టీస్ త‌ర్వాత‌ ఎంత‌గా అల‌సిపోయాడో ఇదిగో ఈ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. చెమ‌ట‌తో త‌డిసి ముద్ద‌యిపోయాడు. అల‌స‌ట నుంచి రిలాక్స్ అవుతున్నాడు. బాగా పెరిగిన గుబురు గ‌డ్డం.. ఆ ర‌గ్గ్ డ్ లుక్ చూస్తుంటే గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ కంటే ర‌ఫ్ గా క‌నిపిస్తాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ రేంజులో శ్ర‌మించ‌క‌పోతే పోటీలో రాణించ‌డం అంత సులువేమీ కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు రూపం మారాలి. స‌త్తా చాటాలి. వ‌రుణ్ చేస్తున్న‌ది అదే. ఈ చిత్రంతో కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు బాబి ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.


Tags:    

Similar News