డల్లాస్ లో జరుగుతున్న మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అక్కడి ఆంధ్రులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధి గా వచ్చిన వేడుక కావడంతో ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు. విదేశాల్లో జరుగుతున్న ఈవెంట్ కనక ఇక్కడి ప్రేక్షకులకు లైవ్ కవరేజ్ లేదు కాని అక్కడ లైవ్ గా చూస్తున్న వాళ్ళు వీడియో రూపంలో యు ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుండటంతో ఏం జరుగుతోంది అనే దాని గురించి అప్ డేట్స్ అయితే వస్తున్నాయి. తాజాగా వరుణ్ తేజ్ అక్కడ స్టేజి మీద చేసిన అల్లరి తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ మూవీ అతడులోని డైలాగ్ ని అప్ప జెప్పిన వరుణ్ తేజ్ పనిలో పనిగా అల్లు అర్జున్ డిజే సినిమాలో సీటిమార్ పాటకు హీరొయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి కాలు కదపడం మొత్తం చప్పట్లతో మారుమ్రోగేలా చేసింది. వరుణ్ కూడా ఇదంతా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నాడు.
మొత్తానికి మా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిరంజీవితో పాటు శ్రీకాంత్ - శివాజీరాజా - వరుణ్ తేజ్ - ప్రగ్యా జైస్వాల్ లాంటి తారలు అక్కడికి తరలివెళ్ళడం ఆకర్షణగా నిలుస్తోంది. తన పేరు మీద ఇక్కడ ఇన్ని అభిమాన సంఘాలు ఉన్నాయని తెలియదని చెప్పి ఎమోషనల్ అయిన చిరంజీవి ఈవెంట్ కాకుండా మిగిలిన ఫ్రీ టైం అంతా ఫాన్స్ ని కలవడంలోనే గడుపుతున్నారు. వరుణ్ కూడా పెదనాన్న కూడా కంపెనీ ఇస్తూ అందరితో కలిసిపోతున్నాడు. మామూలుగా ఇతర హీరోల సినిమాల్లోని డైలాగ్స్ కాని పాటలు కాని చెప్పడం పాడటం నామోషిగా ఈగోలా ఫీల్ అయ్యే కొందరితో పోలిస్తే వరుణ్ తేజ్ చేసింది నచ్చి ఈ వీడియో ఫాన్స్ మధ్య బాగా వైరల్ అవుతోంది. తొలిప్రేమ సక్సెస్ కిక్ నుంచి బయటికి వచ్చి కొత్త సినిమాల మీద ఫోకస్ పెంచుతున్న వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డితో సైన్సు ఫిక్షన్ తో పాటు అనిల్ రావిపూడితో కామెడీ ఎంటర్ టైనర్ కు ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. మొదటిది షూటింగ్ మొదలుపెట్టుకాగా రెండోది త్వరలోనే ప్రారంభం కానుంది.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View