మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొరపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 3న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా తాజాగా సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'గని ఆంథెమ్' ను చిత్ర బృందం విడుదల చేసింది.
'నీ జగజగడం.. వదలకురా కడవరకు.. ఈ కధన గుణం.. అవసరమే ప్రతి కలకు..' అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ మాస్ బీట్ తో పాటు ర్యాప్ మిక్స్ చేసి ఈ సాంగ్ కు ట్యూన్ చేశారు. ఇది క్రీడాకారులను మోటివేట్ చేసేలా ఇన్స్పిరేషనల్ సాంగ్ లా ఉంది. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు తెలుగు ఇంగ్లీషు మిక్సింగ్ గా లిరిక్స్ అందించారు. ఆదిత్య అయ్యంగార్ - శ్రీ కృష్ణ - సాయి చరణ్ - పృథ్వీ చంద్ర కలిసి ఎంతో ఎనర్జిటిక్ గా ఈ గీతాన్ని ఆలపించారు.
వరుణ్ తేజ్ ఒక బాక్సర్ గా రెడీ అవడానికి తీవ్రంగా శ్రమిస్తుండటం.. కోచ్ సమక్షంలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండటం వంటివి ఈ పాటలో చూపించారు. ఇందులో బాక్సింగ్ కోచ్ గా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కనిపిస్తున్నారు. 'గని' సాంగ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమాలోని ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ గుర్తుకు వస్తుంది. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి వరుణ్ తేజ్ ఎలా సన్నదం అయ్యారు.. ఎంతగా కష్టపడ్డారు అనేది ఈ పాటలో కనిపిస్తోంది.
'గని' చిత్రాన్ని రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ పతాకాలపై రూపొందిస్తున్నారు. అల్లు బాబీ - సిద్ధు ముద్ద దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అబ్బూరి రవి ఈ సినిమాకు సంభాషణలు రాస్తున్నారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్ మరియు దిలీప్ సుబ్బరాయన్ ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కి కొరియోగ్రఫీ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'గని'.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా వరుణ్ తేజ్ కు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.
Full View