మెగా హీరోల్లో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ విభిన్నమైన రూట్ లో దూసుకుపోతున్నాడు. మొదటగా ముకుంద.. ఆ తర్వాత కంచె అంటూ ఆకట్టుకున్న తర్వాత.. ఇతడిని వరుస పరాజయాలు వెక్కిరించాయి. పూరీ జగన్నాధ్ తో లోఫర్.. శ్రీను వైట్లతో మిస్టర్ చిత్రాలు తీవ్రంగా డిజప్పాయింట్ చేయడంతో.. ఎప్పుడు కోలుకుంటాడా అని అంతా అనుకున్నారు.
కానీ అంతలోనే బౌన్స్ బ్యాక్ అయ్యాడు వరుణ్ తేజ్. ఫిదా మూవీతో గ్రాండ్ సక్సెస్ కొట్టేసి.. 50 కోట్ల షేర్ మార్కును అందుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమా సక్సెస్ లో మెజారిటీ వాటా హీరోయిన్ సాయిపల్లవి.. దర్శకుడు శేఖర్ కమ్ములకే దక్కుతుందని అన్నవారికి.. తొలిప్రేమ సక్సెస్ తో నోళ్లు మూయించాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను వరుసగా చేసేస్తూ ఆకట్టుకుంటున్న ఈ హీరో.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పుడు ఇతడి టైం సూపర్బ్ గా పరుగు పెడుతోందని చెప్పవచ్చు.
చకచకా సినిమాలు చేసేస్తున్న వరుణ్ తేజ్.. ఇప్పటికే ఓ మల్టీస్టారర్ మూవీలో కూడా భాగం అయ్యాడు. ఇప్పుడు ఓ బైలింగ్యువల్ మూవీకి కూడా యాక్సెప్ట్ చేసి.. మెగా హీరోలలో అత్యంత వేగంగా సినిమాలు చేస్తున్న రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఫిదా మూవీ నుంచి కుర్రకారు ఇతడికి ఫిదా అయిపోవడంతో.. వరుణ్ ఏం చేసినా తెగ నడిచిపోతోంది. ఇకపోతే ఈ రోజు నుండి మనోడు సంకల్ప్ రెడ్డి చేస్తున్న స్పేస్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు.