ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనకాడని హీరోగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పేరు మార్మోగిపోతోంది. తొలి నుంచి అతడి పంథానే వేరు. డెబ్యూ ముకుంద లో ఒక రెగ్యులర్ కుర్రాడిలా కనిపించిన వరుణ్ తేజ్ స్టార్ పవర్ చూపించేందుకు ఏమాత్రం పాకులాడలేదు. కథనంలో గ్రిప్.. పాత్ర చిత్రణలో గమ్మత్తయిన ఎలివేషన్ తో సినిమాని రన్ చేశారు. ఆ తర్వాత కంచె, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం ఇలా ప్రతిదీ విభిన్నమైన ప్రయత్నమే. ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్య ఎలాంటి పోలిక లేకుండా కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకుంటూ తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకునేందుకే వరుణ్ తేజ్ ప్రయత్నించాడు. తన వద్దకు వచ్చే ఏ ప్రయోగాత్మక కథను అస్సలు వదిలిపెట్టడం లేదు.
ఈసారి కూడా అతడు ప్రయోగాల బాటలోనే వెళుతున్నాడు. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలు తీసే హరీష్ శంకర్ తో వరుణ్ తేజ్ ప్రయోగం చేస్తుండడం ఆసక్తికరం. వరుణ్- హరీష్ జోడీ తమిళ బ్లాక్ బస్టర్ `జిగర్తాండ`ను తెలుగులో రీమేక్ చేస్తుండడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. జిగర్తాండలో హీరో పాత్ర నెగెటివ్ షేడ్ తో ఉంటుంది. అందుకే ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా టైటిల్ ని అంతే ఇంట్రెస్టింగ్ గా సెలక్ట్ చేసుకున్నారు.
వాల్మీకి అన్న టైటిల్ తోనే అభిమానులకు సర్ ప్రైజ్ ని ఇస్తూ సినిమాకి క్రేజు తెచ్చారు. తాజాగా వాల్మీకి లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నారు. గుబురు గడ్డం.. గిరజాల జుట్టు.. నుదిటిపైకి రేగిన హెయిర్.. చెవి రింగుతో కాస్త రఫ్ గానే కనిపిస్తున్నాడు. శ్వేదం చిందిస్తూ తీక్షణంగా చూస్తున్న వరుణ్ అచ్చం 300 సినిమాలో స్పార్టన్ లా ఉన్నాడు. తమిళ మాతృక జిగర్తాండలో టైటిల్ పాత్రను బాబి సింహా పోషించారు. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో అతడు కనిపించాడు. ప్రస్తుతం వరుణ్ అదే పాత్రలో ప్రయోగాత్మకంగానే కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.