వరుణ్ వ్యోమగామి పక్కానా??

Update: 2018-05-14 10:21 GMT
వరసగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ కెరీర్ లో ఒక్కో మెట్టు పైకెక్కుతున్నాడు యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్. ఫిదా.. తొలిప్రేమ వరస సక్కెస్ ల తరవాత తెలుగులో ఇంతవరకు రాని ఓ కొత్త కాన్సెప్ట్ కు ఓ కే చెప్పాడు. ఘాజీతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంకల్సరెడ్డి డైరెక్షన్ లో స్పేస్ బ్యాక్ గ్రౌండ్ గా సినిమా చేస్తున్నాడు.

వరుణ్ - సంకల్ప్ రెడ్డిల మూవీలో మేజర్ పార్ట్ అంతరిక్షం జరిగే కథతోనే ఉంటుంది. ఇందులో వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ పాత్రలో కనిపించనున్నాడు.  ఈ సినిమాకు ముందు అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ పరిశీలనలో ఉందనే మాట వినిపించింది. కానీ దీనిపై మూవీ యూనిట్ దీనిని కన్ఫర్మ్ చేయలేదు. కొత్తగా మరో టైటిల్ తెరపైకొచ్చింది. ఈ సినిమాకు వ్యోమగామి అనే టైటిల్ ను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రోనాట్ అనే పదానికి తెలుగు అర్ధం వ్యోమగామి. ఈ టైటిల్ పెట్టడం ద్వారా డైరెక్ట్ గా మూవీ కాన్సెప్ట్ జనాలకు కనెక్ట్ అవుతుందనే ఆలోచనలో ఫిలిం మేకర్లు ఉన్నారు. దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని యూనిట్ లో వినిపిస్తున్న టాక్.

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్... రాజీవ్ రెడ్డి ల సంయుక్త నిర్మాణంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ స్పేస్ కాన్సెప్ట్ సినిమా వస్తోంది. ఈ మూవీలో హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠితోపాటు బాలీవుడ్ హీరోయిన్  చెలియా ఫేం అదితిరావ్ హైదరి నటిస్తున్నారు.
Tags:    

Similar News