మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి విషయం బయటకు వచ్చిన కూడా ఆ న్యూస్ వైరల్ అవ్వకుండా ఉండదు. మెగా యువ హీరోలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ మధ్య వరుణ్ తేజ్ కూడా అభిమానులకు దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు. అందరికంటే చిన్నవాడైన ఈ హీరో ఇంకా పూర్తి స్థాయిలో మాస్ హీరోగా గుర్తింపు పొందలేదు.
మెగా హీరోల స్టైల్ లో కాకుండా తనదైన శైలిలో డిఫరెంట్ గా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎప్పుడు లేని విధంగా వరుణ్ తేజ్ ఒక వెరైటీ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. తన తండ్రి నాగబాబు బాహుబలి ఫేమస్ స్టిల్ ని కొత్తగా ఇవ్వడంతో దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చేతిలో చిన్న పప్పి ఉండడం చూసి అభిమానులు సరదాగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మా నాన్న బాహుబలి పోజ్ ఇవ్వడానికి ఇలా కొత్త పప్పితో ప్రయత్నం చేశాడని వరుణ్ పేర్కొన్నాడు.
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు మంచి ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఘజి దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఒక సినిమా చేస్తున్నాడు. స్పెస్ తరహాలో ఆ సినిమా తెరకెక్కనుంది. ఇక వెంకటేష్ తో మల్టీస్టారర్ F2 ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.