కర్ణాటకలో ఎంతో ఎక్సయిటింగ్ గా షూటింగ్ జరుగుతోంది. సడన్ గా ఒక చిన్న స్టంట్ ను తనే స్వయంగా చేసేశాడు మెగా హీరో వరుణ్ తేజ్. కాని అప్పుడు అతనికి అర్ధంకాలేదు.. ఆ కాలిలో బెణుకు చాలా పెద్ద విషయమే అని. చిన్న క్రాక్ ఇవ్వడంతో.. కాలుకు కట్టేసి ఏకంగా మూడ్నెలలు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు తేల్చేశారు. ఇంకేముంది.. దీపావళి కూడా సోఫాలోనే చేసుకోవాల్సి వచ్చింది.
అయితే అనుకున్నదానికంటే స్పీడ్ గానే రికవర్ అయ్యాడు వరుణ్. ఈరోజు నుండే హైదరాబాదులో ''మిష్టర్'' సినిమా షూటింగులో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికి దాదాపు తనకు కాలు కట్టుకుని రెస్ట్ తీసుకోవడం మొదలెట్టి 50 రోజులు పూర్తయ్యిందట. మొన్ననే కట్టు విప్పాక.. డాక్టర్లు మరోసారి పరీక్షించి.. అంతా ఓకె చెప్పడంతో ఇప్పుడు వరుణ్ షూటింగులోకి దిగిపోయాడు. ఒక ప్రక్కన శ్రీను వైట్ల డైరక్షన్లో మిష్టర్ చేస్తూనే.. మరో ప్రక్కన మనోడు శేఖర్ కమ్ముల డైరక్షన్లో ''ఫిదా'' సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై కూడా చాలా అంచనాలు ఉన్నాయ్ మరి.
ఇకపోతే వరుణ్ తేజ్ ఇలా కెరియర్ తొలినాళ్లలోనే గాయాల పాలవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/