డాడ్ పై మెగా ప్రిన్స్ ఏమ‌న్నాడు?

Update: 2019-03-22 04:36 GMT
ఏపీ రాజ‌కీయాల్లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నెల‌కొల్పిన జ‌న‌సేన పార్టీ దూకుడు పెంచిన సంగ‌తి తెలిసిందే. తొలి సారి ఎన్నిక‌ల‌కు వెళుతున్న సంద‌ర్భంగా ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సోద‌రుడు నాగ‌బాబు పార్టీలో చేరి న‌ర‌సాపురం నుంచి ఎంపీగా బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న కుమారుడు - మెగా ప్రిన్స్ వ‌రుణ్‌ తేజ్ అంత‌రంగం ఏమిటి?. జ‌న‌సేన పార్టీ త‌రుపున నాగ‌బాబు ఎంపీగా పోటీకి దిగ‌డంపై వ‌రుణ్ ఏమ‌న్నాడు? అన్న‌ది ఆస‌క్తికరంగా మారింది. అయితే నాగ‌బాబు జ‌న‌సేన పార్టీలో చేర‌డంపై వ‌రుణ్‌ తేజ్ ట్విట్టర్ వేదిక‌గా స్పందించారు.

`నాన్న జ‌న‌సేన‌ పార్టీలో చేర‌డం నిజంగా ఆనందాన్ని క‌లిగిస్తోంది. బాబాయ్ ప‌వ‌న్‌ తో క‌లిసి పార్టీ తరుపున పోటీకి దిగ‌డం కొత్త ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది` అని త‌న అధికారిక ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుణ్‌ తేజ్ స్పందించారు. దీన్ని బ‌ట్టే అత‌ను న‌రాపురంలో పోటీకి దిగుతున్న తండ్రి నాగ‌బాబు త‌రుపున ప్ర‌చారం చేస్తాడ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌రుణ్‌తేజ్ త‌న తండ్రి నాగ‌బాబు కోసం ప్ర‌చారానికి వ‌స్తాడా? అన్న‌ది తేలాల్సి వుంది. వ‌రుణ్ ప్ర‌స్తుతం కొర్ర‌పాటి కిర‌ణ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్న సినిమాలో న‌టిస్తున్నాడు. అ చిత్రంలో త‌ను బాక్స‌ర్‌ గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

బాక్స‌ర్ గా క‌నిపించేందుకు వ‌రుణ్ సీరియ‌స్ గానే శిక్ష‌ణ పొందుతున్నాడు. అందుకోసం అమెరికాలో ఒలింపిక్ మెడ‌ల్ పొందిన బాక్స‌ర్ వ‌ద్ద బాక్సింగ్ లో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నారు. దీనితో పాటు `జిగ‌ర్తాండ‌` ఆధారంగా హ‌రీష్‌ శంక‌ర్ రూపొందిస్తున్న`వాల్మీకి` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్‌ లో వున్న వ‌రుణ్‌ తేజ్ జ‌న‌సేన త‌రుపున ప్ర‌చారానికి వెళ‌తాడా? అన్న‌దే ఇప్పుడు మెగా అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ట‌. తండ్రి గెలుపు కోసం వ‌రుణ్ ప్ర‌చారానికి వ‌స్తాడా?  లేదా అన్న‌ది మ‌రి కొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది.


Tags:    

Similar News