మెగా హీరో ఎవరి మీద 'ఫోకస్' పెట్టాడు...?

Update: 2020-07-11 15:00 GMT
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్‌ కుమార్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ కరోనా పరిస్థితుల కారణంగా చిత్రీకరణ వాయిదా వేసుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కఠినమైన వర్కౌట్స్ చేసి మంచి ప్రొఫెషనల్ బాక్సర్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నాడు వరుణ్ తేజ్.

కరోనా డేస్ లో కొంచెం రిలాక్స్ అయిన వరుణ్ ఇటీవలే మళ్ళీ వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేసారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వరుణ్ తేజ్ ఈ క్రమంలో లేటెస్టుగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో మరో ఫోటో పోస్ట్ పెట్టారు. జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో తీసుకున్న ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో వరుణ్ సీరియస్ గా వర్కౌట్స్ మీద ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది. దీనికి వరుణ్ తేజ్ 'ఫోకస్' అనే క్యాప్షన్ పెట్టాడు. దీనికి సాయిధరమ్ తేజ్ కూడా రియాక్టై 'స్టడ్' అని కామెంట్ పెట్టారు. మొత్తం బాక్సర్ గా మెప్పించడానికి వరుణ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వ‌రుణ్ తేజ్ ఫస్ట్ సినిమా 'ముకుంద'తోనే తనలో మంచి నటుడు దాగున్నాడని నిరూపించాడు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ చిత్రాల వెనుక ప‌రుగెత్త‌కుండా కంటెంట్ ఉన్న క‌థ‌ల్నే ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో 'కంచె' 'ఫిదా' 'తొలిప్రేమ' 'ఎఫ్ 2' చిత్రాలలో తనదైన మార్క్ నటనతో మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక 'ఎఫ్ 2' కి సీక్వెల్ గా రానున్న 'ఎఫ్ 3'లో కూడా వరుణ్ నటించనున్నారు.
Tags:    

Similar News