మెగా ప్రిన్స్ తొలి ముద్దు తొలి హ‌గ్గు ఎవ‌రితో

Update: 2019-09-25 17:30 GMT
మెగా ప్రిన్స్ త‌న స్కూల్ డేస్ అనుభూతుల్ని పంచుకున్నారు. మంచు ల‌క్ష్మి `ఫీట్ అప్ విత్ స్టార్స్‌`  షోలో పాల్గొన్న వ‌రుణ్ త‌న‌లోని రొమాంటిక్  యాంగిల్ స‌హా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకున్నారు. ప‌దో క్లాస్ లోనే ఫ‌స్ట్ కిస్ ని లాగించేశాడ‌ట‌. అప్పుడు వ‌రుణ్ ఏజ్ జ‌స్ట్ 16(ప‌ద‌హారు). ఆ స‌మ‌యంలో ఆ అమ్మాయి ఎవ‌రో త‌న‌ని వెన‌క నుంచి హ‌గ్ చేసుకుంద‌ని.. త‌న‌కు ఏం జ‌రుగుతుందో తెలీని స‌మ‌యంలో ముద్దు కూడా పెట్టేసుకుంద‌ని.. అంత‌కు మించి ఏమీ జ‌ర‌గ‌లేద‌ని వ‌రుణ్ ఓపెన‌వ్వ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది.

ఆర‌డుగుల ఎత్తు .. మాచో లుక్ తో మెస్మ‌రైజ్ చేస్తున్న ఈ మెగా ప్రిన్స్ సినిమాల్లోకి రాక‌ముందు కాస్తంత‌ అల్ల‌రి పిల్లోడేన‌ట‌. సినిమాల్లోకి వ‌చ్చాక త‌న సినిమాల‌తో ఎంద‌రో అమ్మాయిల్ని ఫిదా చేసిన వ‌రుణ్ అంటే అప్ప‌ట్లో అమ్మాయిలు తెగ ఇష్ట‌ప‌డేవార‌ట‌. హైద‌రాబాద్ లో వున్న ఓ క్ల‌బ్ కి త‌ర‌చూ వెళుతుంటాన‌ని ల‌క్ష్మీ టాక్ షోలో వ‌రుణ్ వెల్ల‌డించారు. అక్క‌డికి నా ఫ్రెండ్స్ గ్రూప్ తో పాటు త‌న‌ని అభిమానించే అమ్మాయిలు కూడా వ‌స్తుంటార‌ని.. ఒక రోజు క్ల‌బ్ లో డీజే స్టార్డ‌వ్వ‌గానే స‌డెన్ గా ఓ అమ్మాయి వ‌చ్చి త‌న‌ని వెన‌క‌గా హ‌గ్ చేసుకుంద‌ని.. త‌ను నా ఫ్రెండ్స్ లో ఒక‌రేమో అనుకున్నాన‌ని అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టాడు.

త‌న‌ని హ‌గ్ చేసుకుంది ఎవ‌రా అని తెలుసుకునే లోపే ఓ అమ్మాయి త‌న బుగ్గ‌పై ముద్దు పెట్టేసి అక్క‌డి నుంచి మెల్ల‌గా జారుకుంద‌ట‌. ఆమె ట‌చ్ అర్థం చేసుకున్నాక ఆమె త‌న ఫ్రెండ్ అని వ‌రుణ్ అనుకున్నాడ‌ట‌. ఎవ‌రో క‌నుక్కుందామ‌ని ట్రై చేస్తే ఆ గుంపులో మిస్స‌య్యిందిట‌. ఆ లోపే ముద్దు పెట్టుకున్న అమ్మాయి అక్క‌డి నుంచి వెళ్లిపోయింద‌ని ఆ స‌మ‌యంలో భ‌య‌ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చాడు. చాలా చాలా బాగుంది ఈ తొలి అనుభ‌వం.


Tags:    

Similar News