శ్రీను వైట్ల సినిమా గోవిందా గోవిందా

Update: 2016-06-07 17:30 GMT
పాపం ఎవ్వరూ చెప్పట్లేదు కాని.. నిజానికి అందరూ కలసి శ్రీను వైట్లకు హ్యాండ్‌ ఇచ్చారనే చెప్పాలేమో. కథ సరిగ్గా సెట్టవ్వలేదనో.. క్లయమ్యాక్స్ సరిగ్గా రాసుకోలేకపోయాడనో.. ఇప్పుడు మెగాహీరో వరుణ్‌ తేజ్ మనం ఊహించినట్లే వైట్లకు హ్యాండిచ్చేశాడని అనిపిస్తోంది.

నిజానికి ఎప్పుడైతే నిన్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల.. వరుణ్‌ తేజ్ తో చేస్తున్న సినిమా కోసం ఒక క్యాస్టింగ్‌ కాల్‌ ప్రకటించాడో.. అప్పుడే ఈ సినిమా షురూ అయినట్లు అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది. అందుకే వెంటనే అందరూ వైట్ల సినిమా మొదలవుతుందో లేదా అంటూ సందేహాలు వ్యక్తపరిచారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు కమ్ములతో చేస్తున్న సినిమా తాలూకు డేట్‌ కూడా వచ్చేసింది. జూలై 18 నుండి షూటింగ్‌ మొదలెడుతున్నాం అంటూ ఆల్రెడీ చాలామంది నటీనటులకు కాల్షీట్లు కూడా ఇచ్చేశారు. మరి జూలై నుండి శేఖర్ తో సినిమా చేస్తుంటే.. ఇక మెగా ప్రిన్స్ వారు శ్రీను వైట్ల రథం ఎక్కేది ఎప్పుడు?

ముందే చెప్పినట్లు ఈ ప్రాజెక్టుకు గోవిందా గోవిందా అంటూ చరమ గీతం పాడేశారనే అనుకోవాలమే. కాని వైట్ల మాత్రం ఇంతవరకు ఉలుకూ పలుకూ లేకుండా సైలెంట్‌ గానే ఉన్నాడు. వేరే హీరో ఎవరిదైనా డేట్స్ దొరికితే వెంటనే సినిమా చేద్దాం అని చూస్తున్నాడట.
Tags:    

Similar News