సాహో డిజాస్టర్ తర్వాత నాని గ్యాంగ్ లీడర్ తో కొంత ఊరట చెందుతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో మరో మాస్ మసాలా హిట్ కోసం ఎదురు చూస్తోంది. దానికి తగ్గట్టే వాల్మీకిలో విషయం ఉన్నట్టు కనిపిస్తున్నా ఆశిస్తున్న బజ్ అయితే ప్రేక్షకుల్లో కానీ ట్రేడ్ లో కానీ లేకపోవడం గమనార్హం. దీనికి కారణాలు ఈజీగానే కనిపిస్తున్నాయి. టిపికల్ సబ్జెక్టు తో రూపొంది తమిళ్ లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వేషాన్ని వరుణ్ తేజ్ చేశాడు. పైగా ఒరిజినల్ వెర్షన్ లో సిద్దార్థ్ హీరో. దాన్ని వాల్మీకిలో అథర్వాకు ఇచ్చారు.
మార్పులు పెద్దగా చేయలేదు అని హరీష్ శంకర్ చెబుతున్నాడు కాబట్టి మరీ గబ్బర్ సింగ్ రేంజ్ లో ఊహించుకోవద్దు అని ముందుగా చెప్పేసినట్టే. అందులోనూ జిగర్ తండా మనవాళ్ళు చాలా మంది చూసేశారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన సినిమా కాబట్టి ఆన్ లైన్ లో పట్టేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇక పూజా హెగ్డే కూడా మెయిన్ హీరొయిన్ కాకపోవడం తనది క్యామియో లాంటి పాత్రేనని హరీషె చెప్పడం తన ఫ్యాన్స్ ని ఎంతలేదన్నా నిరుత్సాహానికి గురి చేస్తుంది.
లీడ్ పెయిర్ అధర్వా-మృణాళిని ఎవరో కూడా ఆడియన్స్ కు తెలియదు. కనీసం వాళ్ళను గట్టిగా ప్రమోట్ కూడా చేయలేకపోయింది యూనిట్. ఈ నేపధ్యంలో బరువు మొత్తం వరుణ్ తేజ్ మీద పడింది. సాఫ్ట్ రోల్స్ తో నెట్టుకొస్తున్న వరుణ్ ని ఇంత మాస్ రోల్ లో చూడటం ఎంత వరకు కనెక్ట్ అవుతుందో రేపు తెరమీద చూస్తే కాని క్లారిటీ రాదు. ఈ అంశాలన్నీ వాల్మీకి మీద ఆశించిన బజ్ ని తేలేకపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా ఓపెన్ అయినా అంత జోష్ కనిపించడం లేదు. మరి 20న వాల్మీకి ఎలాంటి ఫలితం ఇస్తాడో.