వేదం నటుడి వేదన

Update: 2015-06-27 13:30 GMT
అల్లు అర్జున్, మంచు మనోజ్ ల కాంబినేషన్లో వచ్చిన వేదం సినిమాలో నటించిన నాగయ్య గుర్తున్నాడా.... సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడైన నాగయ్య నటన ఆ చిత్రంలో ప్రత్యేకంగా నిలిచింది. సినీరంగానికి చెందిన ఎందరి నుంచో ప్రశంసలు అందుకున్న ఆ నేతన్న ఇప్పుడు ఎవరికీ పట్టనివాడిగా మారిపోయాడు. వేదంలో నటించేనాటికే కడు పేదరికంలో ఉన్న నాగయ్య బతుకు ఆ సినిమా తరువాతా ఏమాత్రం మారలేదు. వేదం విడుదలైన తరువాత ఆ సినిమా యూనిట్ నాగయ్యకు ఆర్థికంగా సాయం చేసింది... కానీ, అవేమీ ఆయన జీవనాన్ని మార్చలేకపోయాయి.  ఇప్పుడు ఆ వృద్ధ నేతన్న, నటుడు నాగయ్య ఫిలింనగర్ లో బిచ్చమెత్తుకుంటున్నాడు.

వేదం సినిమా తరువాత నాగయ్యకు సినిమారంగంలో అవకాశాలేమీ రాలేదు. ఒకట్రెండు చిన్నసినిమాల్లో ఛాన్సొచ్చినా ఆ సినిమాలేవీ గుర్తింపునకు నోచుకోకపోవడంతో ఆయనకు సినిమా పరంగా ఉపాధి దొరకలేదు. దీంతో అటు నేత పనీ లేక.. ఇటు నటనకూ అవకాశం దొరక్క నాగయ్య ఫిలింనగర్ లో యాచిస్తున్నట్లు చెబుతున్నారు.

పేదరికంలో చిక్కుకున్న ఈ వృద్ద నటుడిని మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ అయినా ఆదుకోవాలని కోరుతున్నారు.
Tags:    

Similar News