నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమాల్లో 'ఒక్క మగాడు' ఒకటి. అప్పట్లో మంచి ఫాంలో ఉన్న వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో బాలయ్య నటించడం.. 'ఒక్క మగాడు' లాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టడం.. ఈ సినిమా షూటింగ్ టైంలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ హైప్ పెంచడంతో అభిమానులు సినిమా గుిరంచి చాలా ఊహించుకున్నారు. కానీ తీరా చూస్తే సినిమా దారుణంగా బోల్తా కొట్టింది.
ఆ సినిమాకు హైప్ పెంచడంలో బాలయ్య మీద తీసిన ఫస్ట్ సాంగ్‌ది కీలక పాత్ర. ఈ పాటను రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ జనం మధ్య చిత్రీకరించారు. బాలయ్య వైట్ అండ్ వైట్‌లో అదిరిపోయే గెటప్‌తో ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నాడు. కడప, కర్నూలు, అనంతపురం.. ఇలా రాయలసీమలోని ముఖ్య ప్రాంతాల్లో పాట చిత్రీకరిస్తూ చిత్ర బృందం ఇచ్చిన అప్ డేట్స్ చూసి అభిమానులు ఊగిపోయారు. కానీ సినిమా తేడా కొట్టింది. ఈ పాట కూడా సినిమాలో తుస్సుమనిపించింది.
ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం 'వీర సింహారెడ్డి' నుంచి రిలీజ్ చేసిన తొలి పాట విషయంలో 'ఒక్క మగాడు'తో పోలికలు కనిపిస్తున్నాయి. 'జై బాలయ్యా' అంటూ సాగిన ఈ పాటను కూడా రాయలసీమలోనే తెరకెక్కించారు. ఇందులోనూ బాలయ్య వైట్ అండ్ వైట్‌లో 'ఒక్క మగాడు' గెటప్‌లోనే కనిపిస్తున్నాడు. ఇందులోనూ బాలయ్యను కొనియాడేలా లిరిక్స్ సాగాయి. ఈ రోజు రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలో విజువల్స్, లిరిక్స్ అన్నీ చూస్తే బాలయ్య అభిమానులకు 'ఒక్కమగాడు'లో ఫస్ట్ సాంగ్ గుర్తుకు వచ్చి ఉంటే ఆశ్చర్యం లేదు.
బాలయ్యకు కూడా ఈ పాట చిత్రీకరిస్తున్నపుడు 'ఒక్కమగాడు'నే గుర్తుకు వచ్చి ఉంటుందేమో. ఐతే సెంటిమెంట్లను బాగా ఫాలో అయ్యే బాలయ్య మళ్లీ అలాగే పాట చేశాడంటే.. ఈసారి సినిమా మీద బాగా నమ్మకం ఉన్నట్లే. 'ఒక్కమగాడు' చేదు అనుభవాలు సినిమా చూస్తున్నపుడు గుర్తుకు రాకుండా 'వీరసింహారెడ్డి' అభిమానులను పూర్తి స్థాయిలో అలరిస్తుందని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.