వీర‌సింహారెడ్డిలో `సుగుణ సుంద‌రి` వెరీ స్పెష‌ల్

Update: 2022-12-13 14:30 GMT
నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ మోస్ట్ అవైటెడ్ చిత్రం `వీరసింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. న‌ట‌సింహా ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారని చిత్ర‌బృందం చెబుతోంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ పోస్ట‌ర్లు టీజ‌ర్ మొద‌టి పాట‌తో క్యూరియాసిటీని పెంచ‌డంలో మ‌లినేని బృందం పెద్ద స‌క్సెసైంద‌నే చెప్పాలి.

మొదటి పాట జై బాలయ్యకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా సెకండ్ సింగిల్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న విడుదల చేస్తామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. తాజాగా ఈ పాటను లాంచ్ చేయడానికి సమయాన్ని లాక్ చేసారు. సుగుణ సుందరి సాంగ్ 15 డిసెంబ‌ర్ ఉదయం 9:42 గంటలకు విడుదల కానుంది. ఒక‌ లవ్లీ పోస్టర్ తో ఈ ప్రకటన చేశారు. పోస్టర్ లో బాలకృష్ణ ఏజ్ లెస్ లుక్ తో న‌వ‌యువ‌కుడిని త‌ల‌పిస్తున్నారు. శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్ లో అందంగా క‌నిపిస్తోంది. ఈ యుగళగీతంలో లీడ్ పెయిర్ అద్భుత నృత్యాల‌తో అల‌రించ‌నుంది. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రం కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్‌ను అందించారు.

అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట జై బాలయ్యకు మాస్ నంబర్ అయితే.. సుగుణ సుందరి డ్యూయెట్ కేట‌గిరీలో అల‌రించ‌నుంది. ఈ చిత్రంలో దునియా విజయ్- వరలక్ష్మి శరత్‌కుమార్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. నవీన్ యెర్నేని-, వై రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు.

రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ క్రాఫ్ట్ మ్యాన్ నవీన్ నూలి ఎడిటింగ్ ని.., ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ ని అందిస్తున్నారు. చందు రావిపాటి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. రామ్-లక్ష్మణ్ ద్వయం- వెంకట్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు.

చిత్ర బృందం చివరి పాటను చిత్రీకరించాల్సి ఉంది. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాల న‌డుమ‌ ఈ చిత్రం 12 జనవరి  2023న సంక్రాంతి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News