అఫ్ కోర్స్.. అలాంటి మాగ్నమ్ ఓపస్ సినిమాలు తీయాలని చాలామంది కలలుకంటారు. కాని అందరి విషయంలోనూ అవి నిజంకావు. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఎందరు ప్రయత్నించినా కూడా ''బాహుబలి'' వంటి వార్ ఎపిక్ ను తీయలేకపోయారు. అందుకే రాజమౌళి అంటే అక్కడివారకు కూడా అంత గౌరవం. కాకపోతే ఇప్పుడు తనకు అదే కోరిక బాకీ అంటున్నాడు రచయిత దర్శకుడు వీరు పోట్ల.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలకు కథ మరియు మాటలు అందించి న వీరు పోట్ల.. ఆ తరువాత ''బిందాస్'' సినిమాతో దర్శకుడిగా మారాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా అంటూ చాన్నాళ్ళూ తిరిగాక.. నాగార్జునతో ''రగడ'' తీసి దెబ్బలు తిన్నాడు. కట్ చేస్తే తరువాత వెంకటేష్ అండ్ రవితేజతో ఒక మల్టీస్టారర్ చేయాలి. కాని మంచు విష్ణుతోదూసుకెళ్తా సినిమా చేశాడు. సినిమా హిట్టయినా కూడా.. సినిమాలు చేద్దాం అని చెప్పిన చాలామంది హీరోలు హ్యాండిచ్చారట. అందుకే ''వీడు గోల్డ్ ఏహా'' సినిమా చేయడానికి ఇన్నాళ్ళు పట్టింది.. అంటున్నాడు ఈ దర్శకుడు.
''తెలుగులో ఎలాగైనా కూడా డిఫరెంట్ సినిమాలు చేయాలంటే కాస్త కష్టమే. ఇక్కడ అంత పట్టాన ఏదీ ఒప్పుకోరు. అందుకే కమర్షియల్ సినిమాలు తప్పట్లేదు. ఎప్పటికైనా బాహుబలి వంటి విజువల్ ఫీస్ట్ ఉన్న సినిమా ఒకటి చేయాలనేది నా కోరిక. చేస్తాను'' అంటూ వీరు పోట్ల ముగించాడు. మరి ''ఈడు గోల్డ్ ఏహా'' సినిమాతో హిట్టు కొడితేనే బాహుబలి రేంజ్ సినిమా సాధ్యపడేది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/