నిత్యం రాజకీయాలతో బిజీబిజీగా గడిపే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఒకింత విశ్రాంతి మూడ్ లోకి వెళ్లిపోయారు. ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవంను హైదరాబాద్ లోని సినీమాక్స్‌లో వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అంతేకాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల - ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో చక్కటి సినిమాను అందించారని కొనియాడారు. అంతా కలిసి ఉండాలనే పాయింట్ ను ప్రముఖంగా చెప్తూ అలా ఉండటం ద్వారా సుఖసంతోషాలు వారికి దక్కుతాయని చెప్పిన అంశం చాలా బాగుంది. ఈ సందేశం ప్రస్తుత తరం వారికి అవసరం. ఎందుకంటే అంతే బిజీమయమైపోయిన జీవితాల్లో ఇలాంటి ఉదాత్తమైన అంశంతో సినిమాను తీర్చిదిద్దడం అభినందనీయం అని వెంకయ్య నాయుడు కొనియాడారు.
కథాబలమున్న చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రసాద్. వి. పొట్లూరి బ్రహ్మోత్సవం చిత్రానికి నిర్మాత. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్ బాబు కథనాయకుడిగా నటించారు. కాజల్ - సమంత హీరోహీరోయిన్లు. ఇంకా ఈ సినిమాలో ప్రణీత - సత్యరాజ్ - రావు రమేష్ - జయసుధ - రేవతి - శరణ్య - ఈశ్వరి - తనికెళ్ల భరణి - సాయాజీషిండే - నాజర్ - తులసి - కృష్ణభగవాన్ తదితరులు నటించారు.
Full View