సుమను చూసి నేర్చుకోవాల్సిందే

Update: 2016-12-27 04:58 GMT

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి పాటల విడుదల వేడుక.. తిరుపతిలో అంగరంగవైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు నేల ఖ్యాతి దిగంతాలకు వ్యాపించేలా చేసిన శాతకర్ణిపై తీసిన ఈ చిత్రానికి సంబంధించిన వేడుకలో చాలామంది తెలుగులో మాట్లాడేందుకే ప్రయత్నించారు.

వేడుకకు యాంకరింగ్ చేసిన సుమ అయితే.. కట్టుబొట్టు సహా అన్ని రకాలు అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకట్టుకుంది. సుమ యాంకరింగ్ తీరుకు కేంద్ర మంత్రి వెంకయ్య కూడా తెగ ముచ్చటపడిపోయారు. 'చాలా చక్కగా మంచిగా డైలాగులు చెబుతూ ఉన్నావమ్మా. మా తెలుగు వాళ్లందరూ నిన్ను చూసి నేర్చువాల్సి ఉంది. నువ్వు కూడా ఇప్పడు మా తెలుగు అమ్మాయివే అనుకో. కానీ అందరూ నిన్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఆ కట్టు.. బొట్టు.. మాట.. పాట.. ఇవన్నీ కూడా మన పద్ధతులు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఆపని నువ్వు చేస్తున్నావు. నీకు కూడా అభినందనలు' అన్నారు వెంకయ్య.

సుమ నేటివ్ గా మలయాళీ అమ్మాయి అయినా.. తెలుగునాట టెలివిజన్ లలోను.. సినిమా ఫంక్షన్లలోను తన యాంకరింగ్ తో విపరీతంగా ఆకట్టుకుంటోంది. శాతకర్ణి లాంటి ఫంక్షన్ లో వెంకయ్య ప్రశంసలు సుమకు మరింత శక్తిని.. స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News