ఎన్టీఆర్-నీల్.. స్కై ఈజ్ ది లిమిట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా పట్ల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా పట్ల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఇండస్ట్రీలో భారీ చర్చ నడుస్తోంది. అయితే ఈ సినిమా రేంజ్, కథ, బడ్జెట్ వంటి అంశాల గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్ ఏప్రిల్ నుంచి పూర్తిగా ఈ సినిమా షూటింగ్‌లో బిజీ కానున్నాడు. దాదాపు ఏడు నెలల పాటు కంటిన్యూ షెడ్యూల్స్ ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రశాంత్ నీల్ గత సినిమాల ద్వారా తన స్టైల్‌ను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కేజీఎఫ్ సీరీస్, సలార్ లాంటి సినిమాల్లో భారీ యాక్షన్ బ్లాక్‌లతో ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మరింత ఇంటెన్స్ ప్రాజెక్టు రెడీ చేస్తున్నారని టాక్. ఈ సినిమా కథ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడని రేంజ్‌లో ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత హింట్ ఇచ్చారు.
ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని, యాక్షన్ రేంజ్ గురించి ఊహించలేరని, బాక్సాఫీస్‌పై సునామీ సృష్టించే మూవీ అవుతుందని చెప్పి అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లారు. అలాగే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని ఓ యూనిక్ స్క్రిప్ట్ అవుతుందని తెలిపారు. ఇక రిలీజ్ మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.
ఇక ‘దేవర’ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా హై బడ్జెట్ సినిమాలు లైన్‌లో పెట్టాడు. వార్ 2 పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమా గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో సాగుతుందని, ఎన్టీఆర్ ఓ మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే కథాంశంగా ఉండబోతుందని లీకులు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఏదీ అధికారికంగా రివీల్ చేయలేదు. కానీ ఈ మూవీ 'స్కై ఈజ్ ది లిమిట్' అని నిర్మాత చెప్పిన మాటలు చూస్తే.. భారీ స్కేల్‌లో రూపొందబోతున్న సినిమా అని స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ సినిమాకు ఇప్పటికే 400 కోట్ల బడ్జెట్‌ను మైత్రి మూవీ మేకర్స్ కేటాయించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు, ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద హై బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలవనుందట. ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్ ఎలివేషన్స్‌తో, ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌తో భారీ విజువల్స్‌తో తెరకెక్కబోతోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్‌లో 1000 కోట్ల క్లబ్‌కి చేరిన సినిమా లేదు. కానీ, నిర్మాత మాటలు చూస్తే ఈ సినిమా వెయ్యి కోట్ల సినిమా అనే హింట్ ఇచ్చినట్టే.
ఇండియన్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారీగా రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్‌మెంట్‌కి ముందు నుంచే హైప్ భారీగా ఉంది. నిర్మాత నవీన్ మాటలు అంచనాలను మరింత పెంచేశాయి. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఓ యూనిక్ స్క్రిప్ట్‌తో భారీ హిట్ రావడం ఖాయమంటూ ప్రొడ్యూసర్ కన్‌ఫిడెంట్‌గా చెప్పడం.. అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేస్తోంది. మరి.. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.