ఇండియన్ సినిమా గర్వించ దగిన చిత్ర నిర్మాతల్లో ముందు వరసలో ఉంటారు దగ్గుబాటి రామానాయుడు. ఇవాళ (ఫిబ్రవరి 18) ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా పెద్ద కుమారుడు సురేష్ బాబు, వెంకటేష్ సహా పలువురు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
వాస్తవంగా తెలుగు తెరపై హీరో అవుదామని వచ్చారట రామానాయుడు. కానీ.. ఎందుకో అది సాధ్యం కాకపోవడంతో.. నిర్మాతగా మారిపోయారు. అయితే.. తన కోరికను కొడుకు వెంకటేష్ ద్వారా తీర్చుకున్నారు రామానాయుడు. ఆయన మాత్రం నిర్మాతగా కనీవినీ ఎరుగని రీతిలో వందకు పైగా చిత్రాలను నిర్మించి, గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించారు.
అంతేకాదు.. దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించిన నిర్మాతగా నిలిచారు రామానాయుడు. తద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఫిల్మ్ నగర్‌లో రామానాయుడు విగ్రహానికి పలువురు పూలమాలవేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా.. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ రోజు ఫిల్మ్ నగర్ ఈ స్థాయిలో ఉందంటే దానికి ముఖ్య కారణం రామానాయుడే అని అన్నారు. అయన చేసిన సేవల ఫలితంగానే.. ఫిల్మ్ నగర్‌లో వేలాది మందికి ఉపాధి లభించిందన్నారు.
ఇక, విక్టరీ వెంకటేష్ తండ్రి రామానాయుడు చిత్రపటాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. దానికి భావోద్వేగమైన క్యాప్షన్ రాశారు. ''ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ రోజును తేలిగ్గా తీసుకోలేకపోతున్నాం. మీ జ్ఞాపకాలను ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటాం. లవ్ యూ అండ్ మిస్ యూ నాన్న'' అని రాసుకొచ్చారు వెంకీ.