లైఫ్ అంటే డెస్టినీ. అది ఎటు తిప్పేస్తే అటు తిరగాల్సిందే. తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలిచినది అన్న చందంగా లైఫ్ ఎవరికీ చిక్కదు. అలాంటి సన్నివేశం విక్టరీ వెంకటేష్ కి ఎదురైంది. ఆ సంగతిని ఆయనే స్వయంగా చెప్పారు ఓ ఇంటర్వ్యూలో. ఆరోజు మణిరత్నం `రోజా` చిత్రంలో నటించి ఉంటే ఏమయ్యేదో. నేను కూడా బాలీవుడ్ లో సెటిలైపోయేవాడినే. చెయ్యి విరగడం వల్ల ఆ సినిమా చేయలేదు. లైఫ్ ఆ తర్వాత ఇంకోలా వెళ్లింది. రోజా మిస్సయినా `సుందరకాండ` సినిమా చేశాను. ఆ తర్వాత నా కెరీర్ గురించి తెలిసిందే. వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేశాను. కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఆ తరహా ఆడియెన్ నాకు చేరువయ్యారు.. అని వెంకీ అన్నారు.
ఫలానా సినిమా చేయలేదు అని బాధపడుతూ కూచుంటే ఉపయోగం ఉండదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లిపోవడమేనని వేదాంతం మాట్లాడారు. ఫిలాసఫీలో మాస్టర్ కాబట్టి వెంకీ ప్రతిదీ ఎంతో లైట్ తీసుకుంటూ జీవితంలో అసంతృప్తికి లోనవ్వకుండా, జోవియల్ గా ముందుకు తీసుకెళ్లారని ఆయన మాటలు చెబుతాయి. వేరొకరికి అవకాశం వచ్చిందని కుళ్లుకుపోయే స్వభావం సరికాదని తనదైన శైలిలో చెప్పారు ఫిలాసఫీ మాస్టర్ వెంకీ.
ప్రతి ఒక్కరికీ ఫాంటసీలు ఉంటాయి.. కానీ కుదరొద్దూ? బాహుబలి చేయాలని నాకు ఉండదా? అందరికీ ఆ కోరిక ఉంటుంది. కానీ అవకాశం రావాలి కదా? కుదరాలి కాదా? నా వైపు వచ్చే కథల్నే నేను ఎంచుకున్నాని తెలిపాడు. అమితాబ్ బ్లాక్ చూసినప్పుడు ఆయనలా చేయాలనిపిస్తుంది. అమీర్ ఖాన్ సినిమాలు చూసినప్పుడు అలాంటి ఫీలింగే కలుగుతుంది. కానీ ఆ అవకాశాలు రావాలి కదా? ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుని నటించాలని ఉంటుంది.. అని వెంకీ అన్నారు. మొత్తానికి నవతరం నటీనటులకు కావాల్సినంత స్టఫ్ ని, సూచనల్ని తనదైన అనుభవంతో చెప్పారు వెంకీ. ఇంట్రెస్టింగ్ మాస్టారూ..
Full View