బాబు బంగారం లాంటి యావరేజ్ కంటెంట్ తో కూడా మంచి కలెక్షన్స్ ను సాధించి.. బాక్సాఫీస్ దగ్గర తన స్థాయి తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. సరైన సినిమా పడితే.. తిరిగి బౌన్స్ బ్యాక్ అవడం వెంకీకి పెద్ద కష్టం కాదనే విషయం తేలిపోయింది. అందుకే తన తర్వాతి సినిమాల విషయంలో మరింత కేర్ తీసుకుంటున్న విక్టరీ హీరో.. తన తర్వాతి సినిమాగా సాలా ఖద్దూస్ ను రీమేక్ చేయబోతున్నాడు.
ఈ మూవీ ఒరిజినల్ లో మాధవన్ కండలవీరుడిగా కనిపిస్తాడు. బాక్సింగ్ కోచ్ పాత్ర కావడంతో.. అందుకు తగ్గట్లుగానే కండలు-శరీరం పెంచేశాడు మాధవన్. ఈ పాత్రను చేస్తున్న వెంకీ.. కొంతవరకూ బరువు పెరగడానికి అభ్యంతరం లేదు కానీ.. భారీగా కండలు పెంచేయడం మాత్రం కుదరదని డైరెక్టర్ కి చెప్పేశాడట. ప్రస్తుతం తాను 50+లో ఉండడంతో ఎక్కువగా వర్కవుట్స్ చేసి కండలు పెంచడం ఆరోగ్యపరంగా కరెక్ట్ కాదని చెప్పాడట వెంకీ.
అయినా మాధవన్ టైపులో కండలు పెంచి సినిమా చేయడం కంటే.. తన స్టైల్ లో ఆ రోల్ ని రక్తి కట్టిస్తానని దర్శకురాలు సుధ కొంగరకు వెంకటేష్ చెప్పాడని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుండగా.. ఒరిజినల్ లో నటించిన రితికా సింగ్ ఈ మూవీతో తెలుగులోనూ అరంగేట్రం చేయనుంది.