1980..90 వరకు టాప్ స్టార్ హీరోలు ఏడాదికి అయిదు నుండి పది సినిమాల వరకు చేసే వారు. చిరంజీవి.. బాలకృష్ణ ఇతర స్టార్ హీరోల సినిమాలకు ఒక్క నెలలోనే రెండు సినిమాలు విడుదల అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏడాదికి కనీసం ఒక్కటి అర సినిమాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. స్టార్ హీరోలు మేకింగ్ విషయంలో ఆలస్యం అవుతుంది కనుక పర్వాలేదు కాని యంగ్ హీరోలు కొత్త హీరోలు కూడా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు కూడా చేయలేక పోతున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ యంగ్ హీరోలకు ఆదర్శంగా వరుస సినిమా లను చేస్తున్నాడు.
ఆమద్య వెంకీ మామ కాస్త డల్ అయినట్లుగా అనిపించినా కూడా ఇప్పుడు మాత్రం ఆయన జోరు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన నారప్ప.. దృశ్యం 2 మరియు ఎఫ్ 3 సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈమూడు కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కాస్త టైమ్ సహకరిస్తే మరో సినిమా ను కూడా ఇదే ఏడాదిలో తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. దృశ్యం 2 మరియు నారప్పలు పూర్తి అయ్యాయి. ఎఫ్ 3 కూడా ముగింపు దశకు చేరుకుంది. మరో వైపు రెండు మూడు సినిమాలు కూడా ఈయన చర్చల దశలో ఉన్నాయి.
ఎఫ్ 3 షూటింగ్ పూర్తి అయిన తర్వాత వరుసగా సినిమాలను కమిట్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. వెంకటేష్ తన సినిమా ల కు ఎక్కవ సమయం కాకుండా చూసుకుంటూ ఉన్నాడు. మూడు నాలుగు నెలల్లో సినిమా ను పూర్తి చేసేలా ముందుగానే దర్శకులతో ప్లాన్ చేయిస్తున్నాడు. ఈ ఏడాది మూడు నాలుగు సినిమాలు విడుదల చేయబోతున్న వెంకీ మామ వచ్చే ఏడాది కూడా ఖచ్చితంగా మూడు నాలుగు సినిమా లను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. వంద సినిమాలకు చేరువ అయిన వెంకీ మామ ను చూసి యంగ్ హీరోలు కూడా ఏడాదిలో కనీసం రెండు మూడు సినిమాలు చేసేలా ట్రై చేయాలని సినీ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.