ఎఫ్2ని కాపాడేదెవరు?

Update: 2019-01-08 12:18 GMT
అదేంటో నెల రోజుల క్రితం వరకు నాలుగు సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఓ రేంజ్ హడావిడి ఉంటుందని ఆశించారు అందరు. కాని రోజులు దగ్గర పడే కొద్ది అనూహ్యంగా కొన్నింటి మీద హైప్ తగ్గుతూ పోవడం ఆశ్చర్యం కలిగించేదే. ముఖ్యంగా వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్2 తక్కువ బజ్ తో చాలా మైనస్సులన్ని జోడించుకుని మరీ వస్తోంది. ట్రైలర్ విడుదల అయ్యాక ఒక్క వెంకటేష్ కామెడీ టైమింగ్ తప్ప ప్రత్యేకంగా చెప్పుకునే అంశం ఏదీ కనిపించలేదు. వరుణ్ తేజ్ పక్కాగా తేలిపోయాడు. చూస్తుంటే ఉత్సవ విగ్రహం అయినా ఆశ్చర్యం లేదు.

తమన్నా ఇప్పటికే సీనియర్ బ్యాచ్ లోకి వచ్చేసి అదే పనిగా అభిమానులు చూసేంత రేంజ్ తనకు లేదు. ఇటీవలే నెక్స్ట్ ఏంటి సినిమాను తనను నమ్ముకుని తీస్తే మొదటి రోజు మధ్యాన్నం ఆటకే తీసేయల్సిన పరిస్థితి. ఇక యాక్టింగ్ పరంగా ఇంకా బేసిక్స్ లోనే ఉన్న మెహ్రీన్ సంగతి సరేసరి. తిరిగి తెచ్చుకున్న ఐరన్ లెగ్ మార్క్ గత ఏడాది నోటా-కవచంల పుణ్యమా అని ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా ప్లస్ అవ్వలేకపోతోంది. కనీసం ఒక్క సాంగ్ వైరల్ అవ్వడం మాట అటుంచి కనీసం బాగానే ఉంది కదా అనిపించుకోలేకపోయాయి.

ఎంత కామెడీ టైమింగ్ లో వెంకటేష్ పర్ఫెక్ట్ అయినా సపోర్టింగ్ ఎలిమెంట్స్ లో బలం ఉంటేనే తాను నెట్టుకొస్తాడు. ఆ మధ్య మసాలా అనే సినిమాలో వెంకీ ఎంత నిలబెట్టే ప్రయత్నం చేసినా తీసికట్టు కథా కథనాల వల్ల సినిమా పోయింది. సో వెంకీ ఒక్కడే సరిపోడు.అనిల్ రావిపూడి సక్సెస్ రేంజ్ కూడా సినిమా సినిమాకు తగ్గుతోంది. ఏదో అలా అలా రాజా ది గ్రేట్ కమర్షియల్ గా పాస్ అయిపోయింది కాని ఫార్ములా చట్రంలో తాను ఎంతగా ఇరుక్కుపోయాడో దాంట్లోనే అర్థమైపోయింది. సో మరో మూడు సంక్రాంతి సినిమాల మధ్య వస్తున్న ఎఫ్2 అసాధారణ రీతిలో ఉంటే తప్ప సంక్రాంతి పండగను క్యాష్ చేసుకోలేదన్నది వాస్తవం.



Tags:    

Similar News