విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’ ఇంకొక్క రోజులో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. వెంకీ గత సినిమాలతో పోలిస్తే దీని మీద అంత హైప్ లేదు. పబ్లిసిటీ కూడా మరీ ఎక్కువ స్థాయిలో ఏమీ చేయలేదు. గత ఏడాది ‘బాబు బంగారం’ గురించి అతిగా ఊదరగొట్టి ఎదురు దెబ్బ తిన్న నేపథ్యంలో ‘గురు’ విషయం లో అంచనాల్ని పెంచే ప్రయత్నం చేయలేదేమో అనిపిస్తోంది వెంకీ తీరు చూస్తే. ఈ సినిమాలో కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు వెంకీ. అందుకే నిర్మాత శశికాంత్.. సురేష్ ప్రొడక్షన్స్ అండతో ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేసే సాహసం చేస్తున్నారు. ఆల్రెడీ ప్రిమియర్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రేప్పొద్దున ఫస్ట్ డే టాక్ కూడా ఇలాగే ఉంటే.. సినిమా ఆటోమేటిగ్గా జనాల్లోకి వెళ్లిపోతుందన్న నమ్మకంతో ఉన్నారు.
మరోవైపు వెంకీకి ఈ సినిమా విషయంలో పాజిటివ్ సెంటిమెంట్లు కూడా కనిపిస్తున్నాయి. వెంకీ చివరగా హిట్టు కొట్టింది ‘దృశ్యం’ సినిమాతో. అది ఓ రీమేక్ మూవీ. దానికి లేడీ డైరెక్ట్ అయిన శ్రీ ప్రియ దర్శకత్వం వహించింది. అందులో హీరోయిజం ఉండదు. క్యారెక్టర్.. కంటెంట్ డ్రివెన్ సినిమా అది. ‘గురు’ కూడా అచ్చంగా ఆ తరహా సినిమానే. ఇది కూడా రీమేకే. దీనికీ ఓ లేడీ డైరెక్టరే దర్శకత్వం వహించింది. ఇది కూడా కంటెంట్ డ్రివెన్ మూవీనే. కాబట్టే వెంకీ అన్నిరకాలుగా ఈ సినిమాపై ధీమాగా ఉన్నాడు. ‘కాటమరాయుడు’ జోరు తగ్గడం.. పోటీగా వస్తున్న సినిమాల మీద అంచనాలు లేకపోవడం తమ సినిమాకు కలిసొస్తుందని ‘గురు’ టీం ధీమాగా ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/