విక్టరీ వెంకటేష్ - నాగ చైతన్య కథానాయకులుగా నటించిన వెంకీమామ ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం ఖమ్మంలో వెంకీమామ ప్రీరిలీజ్ వేడుక అత్యంత భారీగా నిర్వహించారు. ఈ వేదిక వద్ద అక్కినేని.. దగ్గుబాటి అభిమానులు పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ.. కేవలం ఐదు రోజుల ముందు ఇంత ఇదిగా ప్రచారం ఊదరగొట్టేసినంత మాత్రాన అది కాస్తా కలెక్షన్స్ రూపంలోకి మారుతుందా? అంటే.. అదో ఛాలెంజ్ అనే భావిస్తున్నారట. వెంకీ మామ కోసం పీపుల్స్ మీడియా- డి.సురేష్ బాబు బృందం దాదాపు 40 కోట్ల మేర ఖర్చు చేశారని తెలుస్తోంది. అయితే డిజిటల్ రైట్స్ - శాటిలైట్- హిందీ డబ్బింగ్ వగైరా అన్నీ కలుపుకుని 25కోట్ల వరకూ రాబట్టవచ్చు. ఇక మిగిలిన 15కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో తేవాల్సి ఉంటుంది.
సురేష్ బాబు సొంత రిలీజ్ కాబట్టి 15కోట్లు రిస్క్ తోనే రిలీజ్ చేస్తున్నట్టు. ఇక డిసెంబర్ 13న సోలోగా వస్తున్న ఈ సినిమాకి కేవలం ఏడు రోజుల్లోనే మొత్తం రాబట్టాల్సిన సన్నివేశం ఉంది. డిసెంబర్ 20 నుంచి 25 వరకూ వరుసగా క్రేజీ చిత్రాలు రిలీజవుతున్నాయి. సినిమా బావున్నా బాగుండకపోయినా ఆ ఏడు రోజులు వెంకీ మామకు ఛాన్స్. ఆ తర్వాత థియేటర్ల నుంచి ఖాళీ చేసి ఇతర సినిమాలకు స్కోప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇందులోనే దబాంగ్ 3 లాంటి క్రేజీ మూవీ కోసం సురేష్ బాబు థియేటర్లు కేటాయిస్తుండడంతో ఇక చిక్కు వచ్చి పడడం ఖాయంగా చెబుతున్నారు. మరి మామ ఏం చేస్తాడో చూడాలి.