బన్నీ మూవీ తర్వాత త్రివిక్రమ్ దానికే కమిట్

Update: 2019-01-27 07:43 GMT
త్రివిక్రమ్‌ మాటల రచయితగా ఉన్న సమయంలో వెంకటేష్‌ సినిమాలకు ఎక్కువ శాతం వర్క్‌ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరీ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అప్పటి నుండి కూడా వీరిద్దరి కాంబోలో మూవీ అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వస్తుంది. త్రివిక్రమ్‌ వరుసగా యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్న కారణంగా వెంకీతో మూవీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వెంకటేష్‌ 'ఎఫ్‌ 2' చిత్రంలో నటించి చాలా కాలం తర్వాత మంచి కమర్షియల్‌ ఎంటర్‌ టైన్‌ అంటూ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. దాంతో వెంకీ వరుసగా సినిమాలను చేయాలని నిర్ణయించుకున్నాడు.

త్రివిక్రమ్‌ మూవీ గురించి వెంకటేష్‌ మాట్లాడుతూ.. గతంలోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కాని మా కాంబినేషన్‌ లో సినిమా రాలేదు. త్వరలోనే త్రివిక్రమ్‌ మంచి కథతో వస్తాడని ఎదురు చూస్తున్నాని వెంకటేష్‌ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అరవింద సమేత చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ తో సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న త్రివిక్రమ్‌ ఆ తర్వాత సినిమాను వెంకటేష్‌ తో చేయాలని ఫిక్స్‌ అయినట్లుగా తెలుస్తోంది.

మల్టీశ్వరి వంటి ఒక ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ కథను వెంకీ కోసం సిద్దం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. 'ఎఫ్‌ 2' చిత్రంతో వెంకీలో ఆ కామెడీ యాంగిల్‌ అలాగే ఉందని నిరూపితం అయ్యింది. అందుకే గతంలో వెంకీ కోసం అనుకున్న స్టోరీ లైన్‌ ను త్రివిక్రమ్‌ డెవలప్‌ చేసి స్టోరీ సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హాసిని హారిక బ్యానర్‌ లో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వెంకటేష్‌, త్రివిక్రమ్‌ ల మూవీ ఉండబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన బన్నీ సినిమా తర్వాత వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News