వెంకీ F3 తరువాత ఆ దర్శకుడితోనే?

Update: 2022-07-16 07:30 GMT
విక్టరీ వెంకటేష్ గత కొంతకాలంగా ఎక్కువగా అయితే రీమేక్ సినిమాలతోనే ప్రేక్షకులను పలకరించాడు. ఇటీవల F3 సినిమాతో పూర్తిగా అయితే సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ సినిమా కమర్షియల్ గా నిర్మాతలకు లాభాలను అందించినప్పటికీ చాలా ఏరియాలలో మాత్రం బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. ఇక వెంకటేష్ తర్వాత సినిమాపై ఇంతవరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు.

కేవలం సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాలి అనే హిందీ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.ఇక స్టైట్ హీరోగా అయితే ఎలాంటి ప్రాజెక్టును కూడా మొదలుపెట్టలేదు.

ప్రస్తుతం చర్చలో దశలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా అవి ఇప్పట్లో అయితే మొదలయ్యే అవకాశం లేదు. గతంలోనే తరుణ్ భాస్కర్ తో ఒక స్టోరీ గురించి బాగానే చర్చలు జరిగాయి.

కానీ పూర్తిగా స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో ఓకే చేయలేకపోయాడు. ఇక జాతిరత్నాలు డైరెక్టర్ KV అనుదీప్ తో కూడా చాలా నెలలుగా చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. జాతిరత్నాలు అనంతరం ఆ దర్శకుడు శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం దర్శకుడు అనుదీప్ వెంకటేష్ తో ఇటీవల ఒక కథ గురించి ధీర్ఘంగా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.

కథ నచ్చడంతో వెంకీ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. సురేష్ బాబు హోమ్ ప్రొడక్షన్ లోనే ఆ సినిమాను తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రిన్స్ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి దీపావళికి విడుదల కానుంది. ఇక ఆ సినిమా అనంతరం అనుదీప్ ఈ ఏడాది డిసెంబర్ లోనే వెంకీతో కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News