ఐదొందల పైచిలుకు చిత్రాల్లో నటించిన ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్. ఒకప్పుడు ఊపిరి తీసుకోలేనంత బిజీ బిజీగా కొనసాగిన ఆయనకి కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అమావాస్యకీ - పౌర్ణమికీ అన్నట్టుగా అప్పుడొక సినిమా ఇప్పుడొక సినిమా చేస్తూ నేనున్నానని ఉనికిని చాటుకొంటున్నాడు. ఇదంతా ఒకెత్తైతే ఆయన చనిపోయాడనే వార్తలు మరొకెత్తు. కొన్ని ఛానళ్లు వేణుమాధవ్ అనారోగ్యంతో మృతిచెందాడని ప్రచారం చేశాయి. దానిపై పెద్ద వివాదమే చెలరేగింది. గవర్నర్ ని - సినిమాటోగ్రఫీశాఖ మంత్రినీ కలిసి ఫిర్యాదు కూడా చేశాడు వేణుమాధవ్. ఏవో ఒకట్రెండు ఛానళ్లు చేసిందానికి వేణుమాధవ్ గవర్నర్ ని కలవడం టూమచ్ అనీ, ప్రచారం కోసమే అలా చేస్తున్నాడని కొద్దిమంది జనాలు మాట్లాడుకొన్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు నాకు ప్రచారమెందుకు? ఆల్రెడీ నేనొక సెలబ్రిటీని కదా అంటూ ఆ వార్తల్ని తోసిపుచ్చాడు.
ఇటీవల ఓ ప్రముఖ పత్రికకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో వేణుమాధవ్ చెప్పిన పలు విషయాలు టూ మచ్ అన్నట్టుగానే ఉన్నాయి. మీకు ఆఫర్లు రాకపోవడానికి కారణమేంటి? అన్న ప్రశ్నకి ఆయన బదులిస్తూ ``డబుల్ మీనింగ్ తో కూడిన డైలాగులు, పాత్రలు తీసుకొస్తుండటంతో నేనే కావల్సి తగ్గించుకొన్నాను`` అని చెప్పుకొచ్చాడు. ఒకట్రెండు సినిమాల్లోనో, ఒకరిద్దరు దర్శకులలో అలా డబుల్ మీనింగ్ సంభాషణలతో రావొచ్చు కానీ, మరీ అందరూ అవే తెస్తారా? నాకు ఆఫర్లు రావడం లేదు అని చెప్పలేక వేణుమాధవ్ ఏదో అలా మాట్లాడేస్తున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు జనాలు. అసలు గుండెందుకు చేయించుకొన్నారు? అని అడిగితే చిరంజీవి - బాలకృష్ణ 150 - 100వ సినిమాలు విజయవంతం కావాలని మొక్కుకుంటూ గుండు చేయించుకొన్నానని చెప్పుకొచ్చాడు. వేణుమాధవ్ చెప్పిన ఇలాంటి ఆన్సర్లు చదివినవాళ్లంతా అవాక్కవుతున్నారు.