పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో బోనీ కపూర్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం నగరంలోని ఓ టెక్నాలజీ కాలేజ్ లో స్టూడెంట్స్ నడుమ ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. వరుసగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్లకు ప్లాన్ చేసారు. ప్రీరిలీజ్ వేడుకకు చిరు-పవన్ - చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని .. ఒక బాలీవుడ్ హీరో కూడా వేదికను షేర్ చేసుకుంటారని ప్రచారమైంది.
ఇకపోతే తాజా ప్రమోషనల్ ఈవెంట్లో ఆదిత్య శ్రీరామ్ మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమాకి తొలుత మగువా అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నామని అయితే పవర్ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని వకీల్ సాబ్ అని మార్చాల్సొచ్చిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఇలాంటి చిత్రానికి దర్శకత్వం వహించే ఎవరైనా అదృష్టవంతులు అని కూడా ఆయన అన్నారు.
థమన్ మాట్లాడుతూ.. పవన్ మాగువా మాగువా పాట విన్నప్పుడు తొలి స్పందన అద్భుతమని ఆ పాట ఉండాల్సిందేనని పట్టు పట్టారని థమన్ వెల్లడించారు. వకీల్ సాబ్ రఫ్ కట్ చూశాక.. తాను రెడీ చేసిన ఓ పాటను స్క్రాప్ లో వేసి మరో పాటను జాయింట్ చేశానని కూడా ఆయన వెల్లడించారు. ఈ సినిమా సన్నివేశాలు విని పాటలు సులువుగానే రాసేశానని పెద్దగా శ్రమించలేదని రామజోగయ్య వెల్లడించారు.