తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు. విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడాయన. విక్రమ్ సినిమా రిలీజ్ అవుతుందంటే జనాల్లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. కచ్చితంగా ఏదొక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడని అందరూ ఫిక్స్ అయిపోతారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా చూసేయిచ్చనే అభిప్రాయానికి వచ్చేస్తారు.
కెరీర్ ప్రారంభంలో నేరుగా పలు తెలుగు సినిమాల్లో నటించిన విక్రమ్.. 'శివ పుత్రుడు' 'అపరిచితుడు' చిత్రాలతో టాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమా కోసం అతను పడే కష్టానికి అందరూ ఫిదా అయ్యారు. అయితే గత కొంతకాలంగా వర్సటైల్ హీరో తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకోలేకపోతున్నారు.
ఎలాంటి జోనర్ లో సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ సాధించలేకపోతున్నారు. తన పాత్ర వరకూ వంద శాతం న్యాయం చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. చివరగా 'మహాన్' అనే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో అలరించిన విక్రమ్.. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు 'కోబ్రా' అంటూ థియేటర్లలోకి వచ్చాడు.
'డీమోంటీ కాలనీ' 'అంజలి సిబిఐ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం "కోబ్రా". టీజర్ - ట్రైలర్ తో సందడి చేసిన ఈ సినిమాపై తెలుగులోనూ ఆసక్తి నెలకొంది. అయితే భారీ అంచనాల నడుమ వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను నిరాశ పరిచింది.
ముందు నుంచీ చెప్తున్నట్లుగానే 'కోబ్రా' సినిమాలో విక్రమ్ విభిన్నమైన గెటప్స్ లో ఆకట్టుకున్నాడు. అయితే గెటప్స్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు.. ఆకట్టుకునే కంటెంట్ ను అందించడంలో ఫెయిల్ అయ్యాడు. నేపథ్యం కొత్తదే అయినప్పటికీ.. దానికి తగ్గ కథాకథనాలు లేకపోవడం డ్రాబ్యాక్ గా మారింది.
విక్రమ్ ని గణిత మేధావిగా పరిచయం చేసినప్పటికీ.. దాని చుట్టూ థ్రిల్లింగ్ గా లాజికల్ గా ఉండే సన్నివేశాలను అల్లుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటి కథను మూడు గంటల నిడివితో చెప్పాలనుకోవడం ప్రధాన మైనస్ గా చెప్పాలి. తమిళ ఆడియన్స్ సంగతేమో కానీ.. తెలుగులో మాత్రం సహనానికి పరీక్ష పెట్టింది. గెటప్స్ సరే కంటెంట్ సంగతేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో అనేకమంది తమిళ హీరోలు తెలుగులో బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. కానీ కొన్నేళ్లుగా విక్రమ్ తీవ్రంగా కష్టపడుతున్నా తెలుగులో ఆశించిన ఫలితం అందడం లేదు. 'కోబ్రా' సినిమాతో సత్తా చాటుతాడనుకుంటే.. ఓపెనింగ్స్ ని బట్టి ఈసారి కూడా నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి.abuse వద్దు.