లాక్‌ డౌన్‌ లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వర్క్‌ ఇలా సాగుతోందట

Update: 2020-04-20 05:30 GMT
బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ఆకాశంలో ఉంచిన రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఖచ్చితంగా బాలీవుడ్‌ సినిమాలను తలదన్నేలా ఉంటుందని అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామంటూ జక్కన్న ప్రకటించాడు. కాని లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

షూటింగ్‌ జరగకున్నా కూడా సినిమాకు సంబంధించిన సీజీ వర్క్‌ జరుగుతున్నట్లుగా జక్కన్న పేర్కొన్నాడు. సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌ ను పలు దేశాల్లో చేయిస్తున్నట్లుగా రాజమౌళి పేర్కొన్నాడు. అక్కడ కూడా లాక్‌ డౌన్‌ ఇతరత్ర ఆంక్షల కారణంగా వారంలో రెండు మూడు రోజుల పాటు వర్క్‌ జరుగుతున్నట్లు రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ప్రతి రోజు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కు సంబంధించి ఫాలో అప్‌ చేయడం తో పాటు స్కైప్‌ లేదా జూమ్‌ లో కీరవాణి.. విజయేంద్ర ప్రసాద్‌ ఇంకా రాజమౌళి ఇతర యూనిట్‌ సభ్యులు సినిమా గురించి చర్చిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

సినిమా షూటింగ్‌ పార్ట్‌ చాలా తక్కువగా ఉందని.. కనుక నెల లేదా నెలన్నర రోజుల్లో షూటింగ్‌ ను పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నా కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కనుక సినిమాను ఖచ్చితంగా అనుకున్న సమయంకు అంటే వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని రాజమౌళి చెబుతున్నాడు. కీరవాణి రాజమండ్రి లో ఉండగా.. విజయేంద్ర ప్రసాద్‌ ఆఫీస్‌ లో.. రాజమౌళి ఇంటికి పరిమితం అయ్యి ఉన్నారట. వారు వారి వారి ప్లేస్‌ ల్లో ఉండే సినిమాకు సంబంధించిన వర్క్‌ లో భాగస్వామ్యం అవుతున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News