రాని కథలూ.. రాని కథనాలూ.. ఉంటాయా??

Update: 2016-06-16 03:58 GMT
ఇప్పటివరకు ఎక్కడా రాని కథ? ఇంతవరకూ ఎవరూ చేయని స్ర్కీన్‌ ప్లే? ఇలాంటివి అసలు సాధ్యమేనా అనే సందేహం ఆడియన్స్ కు ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. నిన్నటికి నిన్న హుస్సేన్ షా కిరణ్‌ అనే దర్శకుడు మాట్లాడుతూ.. 'మీకు మీరే మాకు మేమే' సినిమాలో ఇప్పటివరకు ఇండియన్ స్ర్కీన్ మీద రాని కొత్త స్ర్కీన్ ప్లే ఒకటి ఉంటుందని చెప్పాడు. అలాగే నిఖిల్ తో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాను తీస్తున్న వి.ఐ.ఆనంద్ ఏమన్నాడంటే.. ఇప్పటివరకు ఎక్కడా రాని కథను తను 3 సంవత్సరాలు పాటు కష్టపడి రాసుకుని.. ఈ సినిమాగా మలిచాడట. అంటే.. త్వరలోనే మనం ఎక్కడా రాని కథనం.. ఎక్కడా రాని కథ.. చూడబోతున్నాం అనమాట.

జనాలకు సహజంగా వచ్చే సందేహాలు ఏంటంటే.. అసలు పైన చెప్పబడిన రెండు సినిమాలూ కూడా లవ్‌ స్టోరీలే. వీటిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే కలుస్తారు లేకపోతే విడిపోతారు. ఎలా కలుస్తారు అనేది ఒక కథలో ఉంటే.. ఎలా విడిపోతారు అంటూ ఇంకో కథలో ఉండొచ్చు. వీటిల్లో కొత్త ప్లేసులూ కొత్తరకం సీన్లూ కొత్త కొత్త డైలాగులూ తప్పిస్తే.. కథ కొత్తగా ఎక్కడినుండి వస్తుంది? ఫ్రేమ్ వర్క్ అదే కదా? అలాగే కథనం విషయానికొస్తే.. స్టోరీ స్ర్టయిట్‌ గా చెప్పొచ్చు.. అడ్డదిడ్డంగా అక్కడో ముక్క ఇక్కడో ముక్క చెప్పొచ్చు.. లేదా సెకండాఫ్‌ లో ఫ్లాష్‌ బ్యాక్‌ పద్దతి ఒకటి. లేదంటే '24' సినిమా టైపులో డిటైల్డ్ గానూ చెప్పొచ్చు. ఇవన్నీ కాకుండా కొత్త కథనం ఏముంటుంది అసలు?
Tags:    

Similar News