కరోనాతో నెట్‌ ప్లిక్స్‌ సంచలన నిర్ణయం

Update: 2020-03-26 03:58 GMT
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుంది. దాదాపుగా రెండు వందల దేశాలకు ఈ మహమ్మారి వ్యాప్తి చెందినది. ఈ సమయంలో ఎన్నో దేశాలు ఇప్పటికే లాక్‌ డౌన్‌ ను ప్రకటించాయి. ప్రపంచంలో పలు దేశాల ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. దాదాపుగా 120 నుండి 130 కోట్ల ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిన ఈ సమయంలో ఇంటర్నెట్‌ వినియోగం రెట్టింపు అయినట్లుగా అంతర్జాతీయ సంస్థ ఒకటి వెళ్లడి చేసింది.

ఈ సమయంలో డేటా వినియోగం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ముందు ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉందనే ఉద్దేశ్యంతో నెట్‌ ప్లిక్స్‌ తో పాటు పు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లు ఇంకా వీడియో స్ట్రీమింగ్‌ సంస్థ అయిన యూట్యూబ్‌ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం ఇకపై ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఇంకా యూట్యూబ్‌ లు అత్యంత హై క్వాలిటీ వీడియో కంటెంట్‌ ప్రసారాల నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

హై క్వాలిటీ వీడియోల వల్ల డాటా వినియోగం ఎక్కువ అవ్వడంతో పాటు ఇంటర్నెట్‌ సేవలు భవిష్యత్తులో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో సదరు ఓటీటీ ఇంకా వీడియో స్ట్రీమింగ్‌ సైట్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కరోనా మహమ్మారి నుండి ప్రపంచ బయట పడేంత వరకు అన్ని దేశాల్లో లాక్‌ డౌన్‌ ఎత్తేసే వరకు హై క్వాలిటీ హెచ్‌ డీ వీడియోలను పూర్తిగా నిలిపేస్తున్నట్లుగా నెట్‌ ప్లిక్స్‌ సీఈఓ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.


Tags:    

Similar News