పిల్లలను కనే మెషీన్ ని కాదుగా..

Update: 2017-03-17 13:16 GMT
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడం అంటే.. జనాలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. మీడియాకి కూడా అంత ఉత్సాహం ఉంటుంది. అదే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ని అయితే.. రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఐదేళ్ల క్రితం విద్యాబాలన్ వివాహం చేసుకుంది.

యూటీవీ సిద్ధార్ధ రాయ్ కపూర్ ను 2012లో వివాహం చేసుకుంది విద్య. అయితే.. ఇప్పటివరకూ సినిమాలు చేసుకుంటోంది తప్ప.. పిల్లల ఊసే ఎత్తలేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం బేగమ్ జాన్ మూవీ కోసం ప్రమోషన్స్ చేస్తున్న విద్యా బాలన్ కు పిల్లల విషయంలోనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ సీనియర్ భామకు చిర్రెత్తుకు వచ్చేసి ఎడా పెడా మాటలతోనే వాయించి పారేసింది. "ఈ విషయం నాకు నా భర్తకు తప్ప వేరే ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు" అంటూ కస్సుబుస్సులాడిన విద్య.. ఆ తర్వాత మరింత గట్టిగానే రిటార్ట్ ఇచ్చింది.

"పిల్లలపై అంత మమకారం ఎందుకు.. నేనేమీ పిల్లలను తయారు చేసే మెషీన్ ని కాదు. ప్రస్తుతం ప్రపంచ జనాభా  ప్రమాదకర స్థాయికి చేరిపోయింది. ఒక జంటకు పిల్లలు లేకపోయినా ఏం పర్లేదు. పిల్లలు కచ్చితంగా ఉండాలనే రూలేమీ లేదు" అంటూ విద్యాబాలన్ మాట్లాడ్డంతో.. మీడియా జనాలకు షాక్ కొట్టేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News