మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మలయాళం బ్లాక్ బస్టర్ `లూసీఫర్` తెలుగులో `గాడ్ ఫాదర్` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ ఇమేజ్ కి ఎంత మాత్రం తగ్గకుండా చిత్రాన్ని మలుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా దిగ్గజనటుల్నే రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. చిరంజీవి- సల్మాన్ పాత్రలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని ఎంపిక చేసారని సమాచారం.
ఇందులో విద్యాబాలన్ మెగాస్టార్ సిస్టర్ పాత్రలో కనిపించనున్నారుట. అంటే మాతృకలో మంజు వారియర్ పోషించిన పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. ఈ పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంది. తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని..బాల్యం నుంచే హీరో పాత్రపై ఆమె ద్వేషాన్ని పెంచుకుంటుంది. చివరికి హీరో సహాయంతోనే ఆ పాత్రలో ద్వేషానికి ముగింపు పలుకుతారు. మాతృకలో ఈ సన్నివేశాలు అద్భుతంగా పండాయి. మెహన్ లాల్- మంజు వారియర్ ఆ పాత్రలో ఎంతో చక్కగా నటించారు. రీమేక్ వెర్షన్ లోనూ చిరు-విద్యా పాలను పాత్రలు అంతే హైలైట్ అవ్వాలి. అయితే కథలో తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ నడుమ ఎక్కువగా కమర్శియల్ అంశాలు జొప్పించినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో విమర్శ తెరపైకి వస్తుంది. కథ సోల్ మారనంత వరకూ పర్వాలేదు. అందులో మార్పులు కనిపిస్తే గనుక ఫీల్ కోల్పోతామనే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-సూపర్ గుడ్ ఫిలిమ్స్- ఎన్వీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
పొలిటికల్ థ్రిల్లర్ లో ఎమోషన్ గ్రాఫ్ హై..
మాతృక లూసీఫర్ ఎమోషనల్ కథాంశానికి తగ్గట్టే స్టార్ క్యాస్టింగ్ అదనపు బలంగా నిలిచింది. అందుకే రీమేక్ వెర్షన్ లోనూ అంతకు ఏ మాత్రం తగ్గకుండా స్టార్ లనే దించుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒరిజినల్ లో ని వివేక్ ఓబెరాయ్ పాత్రను మలయాళ నటుడు బిజు మీనన్ తెలుగు వెర్షన్ లో పోషించనున్నట్లు సమాచారం. భీమల్ బాబా నాయర్ పాత్రలో బిజు మీనన్ క నిపించనున్నారు. ఈ పాత్ర ప్రతినాయకుడు ఛాయలు కలిగి ఉంటుంది. పాత్ర లెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. బిజూ మీనన్ కి ఇది తెలుగులో మూడవ చిత్రం. గతంలో ఆయన `ఖతర్నాక్` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన లాయర్ పాత్రలో కనిపించారు. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత `రణం` సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయింది.
మెగాస్టార్ ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ భోళా శంకర్ లో నటిస్తారు.. అలాగే బాబి దర్శకత్వంలో వాల్టేర్ వీరన్న సెట్స్ కి వెళ్లాల్సి ఉంటుంది.