అందంచందం అభినయంతోనే కాకుండా భిన్నమైన పాత్రలను ఎందచుకుంటూ అందరి మన్ననలూ పొందుతున్న విద్యాబాలన్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈసారి ఆమె భారతరాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తి పాత్ర పోషించబోతోంది. ఇంకెవరో కాదు.. భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకొన్న మహిళగా.. మాజీ ప్రధానిగా మంచి పేరుండడంతో పాటు ఎమర్జెన్సీ విధించి అపప్రదా మూటగట్టుకున్న ఇందిరాగాంధీ పాత్రను విద్యాబాలన్ పోషించబోతోందట.
ఇందిరాగాంధీ జీవిత చరత్ర ఆధారంగా మనీష్ గుప్తా ఈ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. స్క్రిప్టు ఇప్పటికే రెడీ అయింది. ఇందిర పాత్ర కోసం విద్యాబాలన్ ను ఎంపికచేసినట్లు సమాచారం.
సినిమా తీశాక వివాదాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది కాబట్టి ముందే గాంధీ కుటుంబం నుంచి అనుమతి తీసుకుని మొదలుపెట్టాలని భావిస్తున్నారట. ప్రతిష్ఠాత్మక వ్యక్తి పాత్ర కావడంతో విద్యాబాలన్ కూడా కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్నప్పటికీ స్క్రిప్టు బాగా నచ్చడం ఓకే చెప్పిందట.