హృతిక్‌ అంత శాడిస్టు ఫెలోనా??

Update: 2016-05-31 15:30 GMT
హృతిక్‌ రోషన్‌అండ్‌ కంగనా రనౌత్‌ మధ్యన జరుగుతున్న లీగల్‌ వార్‌ గురించి మనం కొత్తగా చెప్పేదేముంది. అందరికీ అన్ని విషయాలూ తెలిసినవే. ఇప్పుడు అ ఎపిసోడ్‌ కారణంగా.. మరో కనిపించని ఎపిసోడ్‌ ఒకటి స్టార్ట్ అయ్యింది తెలుసా? అదేంటో తెలిస్తే షాకవుతారు.

కంగనా రనౌత్‌ చాలా డేరింగ్‌ గా ఒక కేసు పెట్టడం.. అలాగే ఎంతటికైనా వెళ్లి పోరాడటానికి సిద్దపడటం.. చాలా పెద్ద విషయమని.. ఆమె కరేజ్ కు నేను జై కొట్టకుండా ఉండలేనని ఆ మధ్యన స్టేట్మెంట్‌ ఇచ్చింది 'కహానీ' బ్యూటి విద్యా బాలన్‌. అసలు కోర్టులో ఉన్న విషయంలో నేను వేలు పెట్టను కాని.. కంగనాను మాత్రం ఎప్రిషియేట్‌ చేస్తున్న. ఆమె పోరాట పటిమ నచ్చింది అనేసింది. అయితే.. ఇప్పుడు విద్యా మాటలతో హృతిక్‌ హర్టయ్యాడు. వెంటనే ''కాబిల్‌'' అనే బడా బడ్జెట్‌ సినిమా విషయంలో చుక్కలు చూపిస్తున్నాడుట. ఎందుకంటే.. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. విద్యా బాలన్‌ మొగుడు.. డిస్నీ ఇండియా సిఇఓ సిద్దార్ధ్ రాయ్‌ కపూర్. ఈ విషయంలో ఇప్పుడు సిద్దూ అండ్ విద్యా మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయినా వాళ్లావాడి కామెంట్లు చేస్తే.. దానికి ప్రొడక్షన్‌ లో ఉన్న సినిమాపై చూపించాల్సిన అవసరం ఏముంది. హృతిక్ మరీ శాడిస్టులా బిహేవ్‌ చేస్తున్నాడు అంటున్నారు బాలీవుడ్‌ వర్గాలు. చూద్దాం ఏం జరగుతుందో!!
Tags:    

Similar News