ఆ బస్టాండులో విద్యాబాలన్ ఏం చేసింది?

Update: 2015-10-26 13:34 GMT
బాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలు మామూలే. అమీర్ ఖాన్ ఎప్పుడూ ఇలాంటి సరదా వేషాలే వేస్తుంటాడు. మారు వేషం వేసి సడెన్ గా జనాల్లోకి వెళ్లిపోయి వాళ్లతో ముచ్చట్లు పెట్టి.. చివరికి తానెవరో చెప్పి జనాల దిమ్మదిరిగిపోయేలా చేస్తుంటాడు. పీకే సినిమా కోసం అమీర్ వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు విద్యా బాలన్ కూడా ఇదే రూట్ ఫాలో అయిపోతోంది. ఈ మధ్య ఈ బబ్లీ బ్యూటీ సడెన్ గా కూలీ అవతారమెత్తింది. రాజస్థాన్ లోని జైపూర్ బస్టాండులో బస్సుల్లోంచి ప్రయాణికుల సామగ్రి మోస్తూ షాకిచ్చింది.

మొదట అమ్మాయి కూలీ అవతారమెత్తడమేంటి అని ఆశ్చర్యపోయిన జనాలు.. కాసేపటికి ఆ అమ్మాయి విద్యా బాలన్ అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఇదేదో సినిమా షూటింగులో భాగంగా వేసిన వేషమేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది.. అదంతా విద్య చేస్తున్న ఓ రియాల్టీ షోలో భాగంగా చేసిన షూటింగ్ తంతు అని. మొత్తానికి ఓ అర గంట పాటు జైపూర్ బస్టాండులో విద్యా బాలన్ హంగామా బాగానే సాగింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ.. షూటింగులో భాగంగానే అయినా.. ప్రయాణికుల బరువైన సామగ్రిని బాగానే మోసింది విద్యా. కాబట్టి సిద్దార్థ్ రాయ్ కపూర్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే మరి.
Tags:    

Similar News