ఇటీవల కాలంలో సినిమా ప్రపంచంలో కొంతమంది సెలబ్రిటీలు వారి ప్రేమను పెళ్లి పీటల వరకు విజయవంతంగా తీసుకు వెళుతున్నారు. కొందరు మధ్యలోనే బ్రేకప్ చెబుతుంటే మరి కొందరు మాత్రం ఊహించిన విధంగా ఎవరికి తెలియకుండానే పెళ్లి ఫోటోలతో దర్శనమిస్తున్నారు. ఇక త్వరలోనే మరొక బాలీవుడ్ జంట ఏడడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
రీసెంట్ గా అయితే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ అలాగే ఆలియా భట్ రన్బీర్ కపూర్ పెళ్లి వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ మారిన విషయం తెలిసింది. అలాగే త్వరలోనే మరికొన్ని జంటలు కూడా పెళ్లి వార్తలతో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక లిస్టులో ప్రముఖ టాలెంటెడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తుపాకి సినిమాలో ప్రధాన విలన్ గా ఎంతగానో ఆకట్టుకున్న విద్యుత్ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతను లీడ్ రోల్స్ లో కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటిస్తున్నారు. నెగటివ్ రూల్స్ తోనే కాకుండా విద్యుత్ మరోవైపు కథానాయకుడిగా కూడా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక గత కొంతకాలంగా ఈ టాలెంటెడ్ యాక్టర్ ఒక ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు, ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీ అని తెలుస్తోంది.
గత ఏడాదిలోనే వీరు లండన్ లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు బాలీవుడ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఈ నటుడు కాస్త ఇన్ డైరెక్ట్ గానే క్లారిటీ కూడా ఇచ్చాడు.
ఇక ప్రస్తుతం వీరిద్దరూ కూడా లండన్ లోనే ఒక వెకేషన్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడే వివాహం కూడా చేసుకోబోతున్నారట. పెద్దగా హడావిడి లేకుండా కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే విద్యుత్, నందితను పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై అతను త్వరలోనే సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.