నయన్ ప్రేమ ఎంత రొమాంటికో చెప్పిన విఘ్నేశ్

Update: 2022-09-19 04:10 GMT
రీల్ లోనే రొమాంటిక్ సన్నివేశాలా? రియల్ లైఫ్ లో ఉండవా? అంటే.. ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం ఇస్తుంటారు. కానీ.. ప్రేమించే మనసు.. అస్వాదించే హృదయం ఉండాలే కానీ.. రియల్ లైఫ్ లోనూ సాధ్యమే. సాధారణంగా రీల్ లో చూపించే ఖరీదైన సర్ ప్రైజ్ లను రియల్ లైఫ్ లోనూ చేసి చూపించింది నయనతార.

ఏడేళ్లు ప్రేమించుకొని ఒక్కటైన నయన్ - విఘ్నేశ్ ల వివాహం ఈ మధ్యనే జరగటం తెలిసిందే. పెళ్లి తర్వాత వారి అనుబంధానికి గుర్తుగా కొన్ని ఫోటోల్ని ఈ ఇద్దరు అప్పుడప్పుడు అభిమానులకు షేర్ చేస్తుంటారు.

పెళ్లి తర్వాత వచ్చిన భర్త మొదటి పుట్టిన రోజును రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేసింది నయన్. ఇప్పుడున్న రోజుల్లో ఎంతసేపటికి.. నేను.. ఆ తర్వాత నువ్వు. నేను - నువ్వు అన్న చట్రంలోనే అన్ని వేడుకలు జరగాలన్నట్లుగా భావించే తరానికి భిన్నంగా.. మన ఇద్దరితో పాటు.. మన వాళ్లు అందరు కూడా అన్న విషయాన్ని చాటి చెప్పేలా నయన్ ప్లాన్ చేసింది. విఘ్నేశ్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా సౌధం వద్ద నిర్వహించింది.

అది కూడా.. తమ కుటుంబ సభ్యులందరి మధ్యన. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన విఘ్నేశ్ ఎమోషనల్ అయ్యారు. తన భార్య తాను ఎప్పటికి మర్చిపోలేని సర్ ప్రైజ్ ఇచ్చిందని పేర్కొన్నారు.

తనను ప్రేమించే వారందరి సమక్షంలో బుర్జ్ ఖలీఫా దగ్గర పుట్టిన రోజు జరుపుకోవటానికి మించింది మరొకటి లేదన్న అతడు.. తన లైఫ్ లో ఇంతటి సంతోషాన్ని నింపుతున్న భగవంతుడికి ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూనే ఉంటానని పేర్కొన్నారు.

సర్ ప్రైజ్ గిఫ్టు అంటే కొత్త అర్థం ఇచ్చేలా చేసిన నయన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె షురూ చేసిన ఈ సర్ ప్రైజ్ ట్రెండ్ గా మారితే.. న్యూక్లియర్ కుటుంబాలకు అనుబంధాల ఆనందం మరింతగా తెలిసే వీలుందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News