సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ నయనతార మరియు సమంతలు కలిసి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది సమ్మర్ లో ప్రారంభించాలనుకున్న ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రారంభించినట్లుగా సమాచారం అందుతోంది. దర్శకడు విఘ్నేష్ శివన్ ఈ ఇద్దరు హీరోయిన్స్ లేకుండానే దాదాపు రెండు మూడు వారాల పాటు ముఖ్య నటీనటుల కాంబో సీన్స్ ను చిత్రీకరించబోతున్నాడట.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను లలితా కుమార్ నిర్మించబోతున్నాడు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. రెండేళ్ల పాటు దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ కథపై వర్క్ చేసినట్లుగా చెబుతున్నారు. తమిళం మరియు తెలుగులో ఒకే సారి ఈ సినిమాను తెరకెక్కించి రెండు భాషల్లో కూడా వేరు వేరు నటీనటులతో రూపొందించి ఒకేసారి విడుదల చేయాలని దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ విషయంలో విఘ్నేష్ శివన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.