లేడీ సూప‌ర్‌స్టార్ పుట్టిన రోజున‌ విఘ్నేష్ స్పెషల్ పోస్ట్‌!

Update: 2022-11-18 15:51 GMT
లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఈ శుక్ర‌వారం త‌న 38వ పుట్టిన రోజు వేడుక‌ల్ని జ‌రుపుకుంది. గ‌త కొన్నేళ్లుగా యువ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో వున్న న‌య‌న‌తార కొన్ని నెల‌ల క్రితం పెద్ద‌ల అంగీకారంతో విఘ్నేష్ ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. చెన్నై స‌మీపంలోని మ‌హాబ‌లిపురంలోగ‌త రిసార్ట్ లో అంగ‌రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీతో పాటు బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు ఈ పెళ్లిలో హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల్ని ఆశీర్వ‌దించారు.

రీసెంట్ గా వీరిద్ద‌రికి స‌రోగ‌సీ ద్వారా క‌ల‌వ‌ల పిల్ల‌లు జ‌న్మించిన విష‌యం తెలిసిందే. దీనిపై వివాదం చెల‌రేగ‌డం.. న‌య‌న దంప‌తుల‌పై చెన్నై ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్ట‌డం.. ఆ త‌రువాత వీరు నిబంధ‌న‌ల‌కు లోబ‌డే స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌లని క‌న్నార‌ని నిర్ధార‌ణ కావ‌డం తెలిసిందే. ఈ వివాదం స‌మ‌సి పోవ‌డంతో న‌య‌న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. న‌య‌న దంప‌తుల‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

ఇలా అవాంత‌రాలన్నింటినీ అధిగ‌మిస్తూ వ‌చ్చిన న‌య‌న్ జంట ఇప్ప‌డు పుట్టిన రోజు వేడుక‌ల్ని సెల‌బ్రేట్ చేసుకుంటోంది. న‌య‌న‌తార పుట్టిన రోజు సంద‌ర్భంగా భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా పెట్టిన ప్ర‌త్యేక పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట న‌య‌న అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ వైర‌ల్ గా మారింది. విఘ్నేష్ ఎమోష‌న‌ల్ పోస్ట్ కి ఫిదా అయిపోయిన అభిమానులు న‌య‌నకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.  

`ఇది మీతో నేను క‌లిసిన 9వ పుట్టిన రోజు ఇది. మీ ప్ర‌తి పుట్టిన రోజు ప్ర‌త్యేకంగా వుంటుంది. గుర్తుండిపోతుంది. మ‌రియు భిన్నంగా వుంటుంది. అయితే ఈ పుట్టిన రోజు అన్నింటికంటే ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే మేము భార్యా భ‌ర్త‌లుగా క‌లిసి జీవితాన్ని మొద‌లు పెట్టిన త‌రువాత జ‌రుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇది. అంద‌రూ ఆశీర్వ‌దించిన ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రి, త‌ల్లిగా వున్నాము.

విఘ్నేష్ కు న‌య‌నపై ఎంత ప్రేమ వుందో స్ప‌ష్టం చేస్తున్న ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెటిజ‌న్ ల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ పోస్ట్ తో పాటు విఘ్నేష్ శివ‌న్ .. న‌య‌న‌తో వున్న ప‌లు ఫోటోల‌ని కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఇదిలా వుంటే న‌య‌న‌తార `క‌నెక్ట్‌` అనే హార‌ర్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తోంది. విఘ్నేష్ శివ‌న్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News