సహజీవనంకు గుడ్‌ బై చెప్పి పెళ్లికి రెడీ అయ్యింది

Update: 2019-09-26 05:04 GMT
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార గత కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. విఘ్నేష్‌ శివన్‌ తో విదేశాల్లో హాలీడేస్‌ ను ఎంజాయ్‌ చేయడం.. చెన్నైలో సన్నిహితుల వేడుకలో కలిసి పాల్గొనడం ఇంకా ఇతరత్ర కారణాల వల్ల వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండటం మాత్రమే కాదు ఇద్దరు సహజీవనం కూడా సాగిస్తున్నారని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇటీవలే తన డబ్బులతో నయన్‌ ప్రియుడు విఘ్నేష్‌ ను నిర్మాతగా మార్చిందని కూడా అంతా అంటున్నారు.

ప్రస్తుతం హీరోయిన్‌ గా ఫుల్‌ స్వింగ్‌ లో ఉన్న కారణంగా పెళ్లి విషయమై ఆలోచించడం లేదని ఇంత కాలం ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయన్‌ పెళ్లికి సిద్దం అయ్యింది. నయన్‌ ప్రేమించడం మాత్రమే చేస్తుంది.. పెళ్లి అంటే ఆమెకు ఇష్టం ఉండదు అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు విఘ్నేష్‌ శివన్‌ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యింది. వీరి వివాహం డిసెంబర్‌ లో జరుగబోతుందట. ఈ విషయమై తమిళ సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

గతంలో రెండు లవ్‌ ఫెయిల్యూర్స్‌ ను ఎదుర్కొన్న నయనతార ఈసారి మాత్రం తన ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్తుందని అంతా భావిస్తున్నారు. విఘ్నేష్‌ శివన్‌ తో చాలా కాలంగా నయన్‌ ప్రేమలో ఉంది. ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు లేకపోవడంతో పాటు తన అభిప్రాయానికి విఘ్నేష్‌ పూర్తి విలువను ఇస్తాడని నయన్‌ భావిస్తుంది. అందుకే విఘ్నేష్‌ తో తన జీవితం సంతోషంగా ఉంటుందని నయన్‌ భావిస్తుందట. అందుకే పెళ్లి చేసుకుని లైఫ్‌ లో సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకుందంటూ ఒక ప్రముఖ తమిళ మీడియా సంస్థ ఒక కథనంను ప్రచురితం చేసింది. ఆ కథనం ప్రకారం నయన్‌.. విఘ్నేష్‌ ల పెళ్లి విదేశాల్లో అయిదు రోజుల పాటు అదేనండి డెస్టినేషన్‌ మ్యారేజ్‌ తరహాలో చేసుకోబోతున్నారట.

Tags:    

Similar News